బుద్ధం శరణం గచ్ఛామి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ‘బుద్ధం శరణం గచ్ఛామి’ జపిస్తున్నారు.ఆయన మామగారు, ఉమ్మడి రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు కూడా ఈ మంత్రమే జపించి హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌ మధ్యలో అతి పెద్ద బుద్ధ విగ్రహం (ఏకశిల) నెలకొల్పారు.

 Amaravati As Tourist Destination-TeluguStop.com

హైదరాబాదు నగరంతో (తెలంగాణతో కాదు) బుద్ధుడికి సంబంధం లేకపోయినా తనకు బుద్ధుడు అంటే ఇష్టం కాబట్టి బుద్ధ విగ్రహం నెలకొల్పారు ఎన్‌టిఆర్‌.ఇప్పుడు చంద్రబాబు కూడా మామ బాటలోనే నడుస్తున్నారు.

ఏపీ రాజధాని నగరం నిర్మిస్తున్న ప్రాంతమంతా ఒకానొక కాలంలో బౌద్ధమతం విరాజిల్లిన ప్రాంతం.పురావస్తు శాఖ తవ్వ కాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన అనేక అవశేషాలు, ఆరామాలు బయటపడ్డాయి.

ఆనాడు తెలంగాణ, ఆంధ్ర అనే విభజన లేనికాలంలో తెలుగువారు నివసించే అనేక ప్రాంతాల్లో బౌద్ధమతం వ్యాపించింది.అమరావతి (రాజధాని కాదు.

అమరేశ్వరుడి ఆలయం ఉన్న ఊరు) ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం.ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న బౌద్ధులకు ఇది పవిత్ర ప్రాంతం.

అందుకని రాజధాని నిర్మిత ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాలను, నాగార్జున కొండను, ఆ మతానికి సబంధించి ఇతర కట్టడాలను పరిరక్షించి, అభివృద్ధి చేసి ‘బుద్ధిస్‌్ట టూరిజం’ డెవలప్‌ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.విదేశాల్లో ఉండే బౌద్ధులు, ఇతర పర్యాటకులు ఇక్కడికి కుప్పలుతెప్పలుగా రావాలిని బాబు ఆకాంక్ష.

విజయవాడలోని భవానీ ద్వీపాన్ని సింగపూర్‌ కంపెనీల సహకారంతో పర్యాటక ప్రాంతంగా చేస్తారట.ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేసే ప్రాంతాల లిస్టు చాలా పెద్దదే బాబు దగ్గర ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube