రాజధానుల బిల్లుపై జగన్‌ కీలక భేటీ  

Jagan Meeting With Ycp Ministers About Ap Capital Bill-ap Capitals,ap Cm Jagan Mohan Reddy,chandrababu Naidu And Jagan Mohan Reddy,jagan

అసెంబ్లీలో పాస్‌ అయిన మూడు రాజధానుల బిల్లును మండలి తిరష్కరించడం.సెలక్షన్‌ కమిటీకి పంపించడంతో సీఎం జగన్‌ ముఖ్య నాయకులతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు.

Jagan Meeting With YCP Ministers About Ap Capital Bill-Ap Capitals Ap Cm Mohan Reddy Chandrababu Naidu And

ఈ భేటీలో తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.మండలిలో ఇలాంటి పరిణామం ఎదురవుతుందని ఊహించని జగన్‌ అండ్‌ టీం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

మండలిలో బలం లేకున్నా కూడా ఏదో ఒక విధంగా బిల్లు పాస్‌ చేసుకుని తీరుతామని జగన్‌ అండ్‌ టీం అనుకుంటే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీలు తీసుకు వచ్చిన 71 రూల్‌ ప్రభుత్వంకు పెద్ద షాక్‌ ఇచ్చింది.

ఈ సమయంలో విజయసాయి రెడ్డితో పాటు పలువురు మంత్రులు మరియు వైకాపా నాయకులు మరియు న్యాయ నిపుణులతో జగన్‌ భేటీ అయ్యాడు.

మూడు రాజధానుల విషయమై వెనక్కు తగ్గడమా లేదంటే వేచి చూసే దోరణి అవలంభించి సెలక్షన్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చే వరకు వెయిట్‌ చేయాలా అంటూ చర్చలు జరుగుతున్నాయి.మండలి రద్దుకు సిఫార్సు చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొందరు ఈ చర్చల్లో లేవనెత్తగా అందుకు న్యాయనిపుణులు మాట్లాడుతూ మండలి రద్దు కేంద్రం పరిధిలో ఉంది కనుక సంవత్సరంకు పైగానే సమయం పడుతుంది.

అప్పటి వరకు రాజధాని బిల్లు విషయం మరుగున పడిపోతుంది అంటూ వారు చెబుతున్నారు.మొత్తానికి ప్రభుత్వంకు పెద్ద సంకటం వచ్చింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Jagan Meeting With Ycp Ministers About Ap Capital Bill-ap Capitals,ap Cm Jagan Mohan Reddy,chandrababu Naidu And Jagan Mohan Reddy,jagan Related....