విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డాడు.టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.
అధికారం, పదవి పోయినప్పుడు ప్రజల ముందు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తానని ఐదేళ్ల పాలనలో చేసిందేమి లేదని, విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి.
ఏం చేశారని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా మారుస్తానని చెప్పి రైతులను మోసం చేశాడన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పథకాలను పక్కనపెట్టి రాష్ట్ర ఖజానాను అమరావతి రాజధాని నిర్మాణం కోసం పెట్టాడన్నారు.అమరావతి నిర్మాణంతోనే రియల్ ఏస్టేట్ పెరిగిందని వ్యాఖ్యానించారు.
నిర్మాణం కోసం ఉదయం పూట సింగపూర్ అధికారులతో, మధ్యాహ్నం చైనా అధికారులతో మాట్లాడి కాలక్షేపం చేశారని ఆరోపించారు.
అమరావతి రైతుల నుంచి భూములు లాక్కొని మాయమాటలు చెప్పి మోసం చేశాడని, అందుకే లోకేష్ ను అక్కడి ప్రజలు ఓడించడానికి కారణమన్నారు.సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్ గనుల సమస్యను ఏనాడు పట్టించుకోలేదు.కేవలం మాటలకే పరిమితమయ్యారు.
సింహాచలం పంచగ్రామాలపై అదే తీరు అవలంభించారు.అమరావతి రైతులపై వైసీపీ వ్యతిరేకం కాదని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తామన్నారు.
విశాఖ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడటం కరెక్ట్ కాదని, విశాఖను రాజధాని వద్దనుకుంటే టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు అని మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాల్ చేశారు.