అమరావతి పై జగన్ కీలక నిర్ణయం ? ఇది నిజంగా సంచలనమే

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అంటూ తెలుగుదేశం పార్టీ గట్టిగానే హడావుడి చేస్తోంది.ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేస్తుండటంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడమే కాకుండా, దానిని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయింది.

 Ap Cm Jagan Mohan Reddy Take The Key Decision About Amaravathi Capital Of Ap, Am-TeluguStop.com

ఇప్పటికే అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు దాటిపోయింది.ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

రాజధాని పేరుతో ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మాణం పూర్తవ్వగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.ఇప్పుడు ఆకస్మాత్తుగా రాజధానిని తరలించడం వల్ల అవి నిరుపయోగంగా మారడంతో పాటు, అక్కడ భారీ ఎత్తున భూములు ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారిలో ఆందోళన నెలకొంది.

అక్కడ భూముల విలువ పెరిగితే ఆర్థికంగా రైతులు, ప్రజలు లాభపడే అవకాశం ఉంటుందని భావించిన వారందరికీ జగన్ నిర్ణయం ఆగ్రహమే కలిగించింది.

Telugu Amaravathi, Ap Amaravathi, Coronavirus, Jagan, Telugudesham-

అక్కడ ప్రజలకు జగన్ తీసుకున్న నిర్ణయం ఆగ్రహాన్ని కలిగించింది.ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.ప్రస్తుతం కరోనా కారణంగా ఆందోళనలు కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి.

కానీ కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేస్తే, అమరావతి ఉద్యమం మరింత తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం లేకపోలేదు.వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న జగన్ అమరావతి లో ఒక కదలిక తీసుకు రావాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అమరావతి శాసన రాజధానిగా ప్రకటించడంతో ఇక్కడ పెద్దగా కార్యకలాపాలు ఏమీ జరగవు కాబట్టి తాము నష్టపోతామని అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన చేపడుతున్నారు.అందుకే వారికి ఆర్ధికంగా భరోసా కల్పించితే అమరావతి ఉద్యమం చల్లారి పోతుంది అని వైసీపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Telugu Amaravathi, Ap Amaravathi, Coronavirus, Jagan, Telugudesham-

ప్రభుత్వానికి అప్పగించిన భూములను అభివృద్ధి చేసి, దాదాపు నాలుగో వంతు తిరిగి రైతులకు కేటాయించి, వాటిని విక్రయించడం, అపార్ట్మెంట్లు నిర్మించినా, , వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించినా బాగా లాభ పడతామనేది అక్కడి రైతులు ఆలోచన.మొత్తం రాజధాని తరలిపోతే , తమ ఆశలు గల్లంతు అవుతాయనే అభిప్రాయంతో ఇప్పుడు రాజధాని ఉద్యమాన్ని తెరపైకి ఎత్తుకున్నారు.దీనిని గమనించి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో విద్య, వ్యవసాయ కేంద్రంగా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలు రైతులకు, మేలు చేకూరే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.రవాణా, జల వనరులు అందుబాటులో ఉన్న ఈ కీలక ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో కార్పొరేట్ సంస్థను నెలకోల్పే విధంగా భూకేటాయింపులు చేయగలిగితే, భూముల విలువ బాగా పెరుగుతుందని, అప్పుడు అమరావతి రైతులు శాంతిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను, నిర్మాణం మధ్యలో ఆగిపోయిన అన్నిటినీ పూర్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా ప్రభుత్వం కూడా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉంది.ఇక్కడ ప్రైవేటు సంస్థల పెట్టుబడులు తిరిగితే, భూముల విలువ పెరుగుతూ ఉండడంతో పాటు, ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గిపోతుంది అనేది ప్రభుత్వ ఆలోచన.

అమరావతి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా లేదని, కేవలం అమరావతి పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉందని, కానీ తెలుగుదేశం దీని రాజకీయ కోణంలో హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని వైసిపి భావిస్తోంది.అందుకే ఈ విధంగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube