చెట్టెక్కి కొబ్బరి బోండాలు కోస్తున్న రోబో...! ఎలానో మీరు ఓ కూడా చూసేయండి...!

మనకు బజారులో అతి సులువుగా దొరికే కొబ్బరి బొండాలను తాగడం పెద్ద విషయమేమీ కాదు.కాకపోతే ఆ కొబ్బరిబొండాలు ఆ ప్రదేశానికి రావడానికి ఎంత కష్టమో తెలుసా మీకు.? అవును కొబ్బరి బొండాలు మనకు చేరాలంటే ముందుగా కొబ్బరి చెట్టు రైతు ఆ చెట్టుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత, ఆ కొబ్బరిబోండం కోసి… ఆపై ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు భరించి మరీ ప్రజలకు చేరుస్తారు.కాకపోతే ఈ కొబ్బరి బొండాలు కొనడం అంత సులువు పని కాదు.

 Amaran Robot Discovered By Amrita University Students Tamil Nadu, Tamil Nadu, Am-TeluguStop.com

అది అందరికీ తెలిసిన విషయమే.అందుకు సరైన ట్రైనింగ్ కూడా కావాలి.

ఇలా కొబ్బరి చెట్టు ఎక్కి అక్కడ కొబ్బరి బోండాలు కోసే సమయంలో పొరపాటున ఏదైనా ప్రమాదానికి గురైతే వారి ప్రాణాలకు ముప్పు సంభవించవచ్చు.ఇప్పటికే ఇలా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

దీంతో ప్రస్తుతం ఇలాంటి పనులు చేసే వారు చాలావరకు తగ్గారు అని చెప్పవచ్చు.నేడు ప్రస్తుతం కొబ్బరి బొండాలు కోయడానికి వెళ్లే వారికి మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా సైంటిస్టులు రోబోను రూపుదిద్దారు.ప్రస్తుతం సమాజంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని రోబోటిక్ యంత్రాన్ని తయారు చేశారు.వీటిని చూస్తే భవిష్యత్తు మొత్తం పూర్తిగా రోబోలదని అర్థం అవుతోంది.అయితే ఈ వినూత్న రూపకల్పనని మన శాస్త్రవేత్తలే కనిపెట్టారు.

తమిళనాడు రాష్ట్రంలోని అమృత విశ్వ విద్యాపీఠం యూనివర్సిటీ బృందం వారు ఈ రోబో రూపకల్పన చేశారు.ఈ రోబో ప్రత్యేకత ఏంటంటే.

కొబ్బరి చెట్టును రోబో ఎక్కేసి కొబ్బరికాయలను ఈజీగా తెంపేస్తుంది.కొత్తగా తయారుచేయబడిన రోబోకు ” అమరన్ “ అనే పేరును నామకరణం చేశారు.

ఇక ఈ రోబో తయారు చేయడానికి గత మూడు సంవత్సరాల నుండి రాజేష్ ఖన్నా బృందం కృషి చేస్తోంది.ప్రస్తుతం ఈ రోబో 6 వ దశలో టెస్టింగ్ చేస్తున్నట్లు వారు తెలియజేశారు.

ముందుగా ఈ రోబోను చెట్టుకు అమర్చి ఆ తర్వాత అందులోని కంట్రోల్ సిస్టం ద్వారా ఓ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఓ యాప్ కు అనుసంధానం చేసి పైకి, కిందకి కదిలించడం… ఆ తర్వాత కొబ్బరి చెట్టు పైకి రోబో చేరుకున్నాక టెక్నాలజీ సాయంతో కొబ్బరి బొండాలను కత్తిరించి నేలపై పడేలా చేయవచ్చు.అయితే ప్రస్తుతానికి ఒక్కో చెట్టుకు 15 నిమిషాల సమయం తీసుకుంటుందని వారు తెలియజేశారు.

తాజాగా ఈ రోబో 49 అడుగుల ఎత్తు ఉన్న కొబ్బరి చెట్టును ఎక్కడం జరిగింది.అంత ఎత్తుకు చేరుకున్న తర్వాత కూడా కొబ్బరి బొండాలను కోసింది.ప్రస్తుతం ఈ రోబో ఇంకా ట్రైల్స్ లోనే ఉంది కాబట్టి బోండాలను కోసే సమయంలో కాస్త నిదానంగా ఆపరేట్ చేస్తోంది.అయితే భవిష్యత్తులో దీన్ని మరింతగా అభివృద్ధి చేసి త్వరగా కొబ్బరి బొండాలను కట్ చేసే విధంగా చూస్తామని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube