కెరీర్ బిగినింగ్‌లో బూతులు తిట్టారు.. ఇప్పుడు డేట్స్ ఇవ్వండి సర్ అంటున్నారు: అమర్ దీప్

బుల్లితెరపై అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఓర్చి ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అమర్ దీప్. సిరి సిరి మువ్వలు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అడుగు పెట్టిన అమర్ దీప్ తన నటన ప్రతిభతో అభిమానులను సంపాదించుకున్నారు.

 Amar About Insults By Jabardasth Team, Amar Deep, Janaki Kalaganaledu, Jabardast-TeluguStop.com

అవకాశాలు అందరికీ వస్తాయి.ఒకరు ఇప్పిస్తేనో, ఒకరు తీసుకొచ్చి పెడితెనో దాని విలువ తెలియదు.చెమట పట్టేలాగా, చెప్పులు అరిగేలా తిరిగితే, చెప్పుదెబ్బలు తినేలా మాటలు వింటే.అప్పుడు లైఫ్ లో పైకి వస్తారు.

అని అమర్ దీప్ అన్నారు.అలాంటి సంఘటనలు తన లైఫ్ చాలానే జరిగాయని ఆయన వాపోయారు.

ఒకానొక సందర్భంలో జబర్దస్త్ చూడడానికి వెళ్ళినపుడు కూడా తనను ఎన్ని వల్గర్ మాటలు అన్నారో, మాట్లాడారో తనకి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.కానీ తాను కొంచెం సెటిల్ అయ్యాక.

ఆ మెనేజెర్సే తిరిగి ఒక మూడేళ్ల తర్వాత వచ్చి సర్ మీ డేట్స్ కావాలని వచ్చారని ఆయన తెలిపారు.అప్పుడు తానేమీ అనకుండా మీరు నన్ను తిట్టారు గుర్తుందా అండి.

అనే సరికి.సారీ సార్ అని అన్నారు.

దానికి ఆయన పర్లేదండి ఇంకోసారి అలా అనకండి అని చెప్పానంటూ అమర్ దీప్ అన్నారు.అంతే కాకుండా వాళ్ళు ఫోన్ చేసి సర్ అన్నప్పుడు, మీ డేట్స్ కావాలని అన్నపుడే సగం చచ్చిపోయారని .ఇంకా అంతా కంటే హ్యాపీ ఫీలింగ్ ఏముంటుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Amar Deep, Insults, Jabardasth-Movie

ఇదిలా ఉండగా.శైలజా రెడ్డి లాంటి పెద్ద సినిమాల్లో చేశానని.కానీ తీరా సినిమా చూస్తే అసలు ఆ సీన్లు లేవని అమర్ దీప్ తెలిపారు.కొందరు ఆడిషన్ కి వెళ్లి రిజెక్ట్ అవుతారు.కానీ తాను షూటింగ్ చేసి కూడా రిజెక్ట్ అయ్యానని ఆయన తెలిపారు.బెంగుళూర్ సూపర్ స్టార్ యశ్ లాగా, బాలీ వుడ్ షారుఖ్ ఖాన్ లాగా, తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజలాగా పేరు వచ్చినపుడు తాను నిజంగా సక్సెస్ వచ్చినట్టు ఫీల్ అవుతానని అమర్ దీప్ తన లక్ష్యాన్ని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube