మరోసారి అఖిల్ కి తల్లిగా ఆ ఫ్యామిలీ హీరోయిన్  

Amani Play Mother Role To Akhil Once Again, Hero Akhil, Most Eligible Bachelor, Veteran Heroine Amani, Pooja Hegde, Director Bhaskar - Telugu Amani Play Mother Role To Akhil Once Again, Director Bhaskar, Hero Akhil, Most Eligible Bachelor, Pooja Hegde, Veteran Heroine Amani

టాలీవుడ్ ఫ్యామిలీ కథలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఆమని, కెరియర్ ఆరంభంలో కమర్షిల్ సినిమాలు చేసిన తరువాత శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు ఆమని కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచిపోయాయి.ఒక గృహిణి పాత్రలో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.

TeluguStop.com - Amani Play Mother Role To Akhil Once Again

తెలుగులో సుమారు అప్పటి స్టార్ హీరోలుగా ఉన్న చాలా మందితో ఆమని జత కట్టింది.ఇదిలా ఉంటే ఈమె అప్పట్లో సిసింద్రీ సినిమాలో అఖిల్ తల్లిగా చేసింది.

మరల ఇన్నేళ్ళ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో అఖిల్ కి రెండో సారి తల్లిగా నటుస్తుంది.తాజాగా ఆమని అఖిల్ తో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

TeluguStop.com - మరోసారి అఖిల్ కి తల్లిగా ఆ ఫ్యామిలీ హీరోయిన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సిసింద్రీ సినిమాలో అఖిల్‌కు అమ్మ పాత్ర చేయాలని నాగార్జున అడిగిన వెంటనే ఒప్పుకున్నా.

చాలా కష్టపడి సిసింద్రీ చేశాం.30 రోజుల్లో సినిమా అనుకుంటే 60 రోజులైంది.చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది.

అఖిల్ ప‌డుకున్న‌పుడు మేం కూడా విశ్రాంతి తీసుకునేవాళ్లం.వాడికి మూడ్ వ‌చ్చిన‌పుడు షూట్ చేసేవాళ్లం.

అఖిల్‌కు అందరూ సహకరించారు. సిసింద్రీ సినిమా షూటింగ్ జరిగిన‌న్ని రోజులు సమయమే తెలియలేదు.

నా సొంత బిడ్డ లాగే అనిపించాడు అఖిల్.న‌న్ను అమ్మ‌లాగే భావించేవాడు.అమ్మా అనే అనేవాడు.ఇప్పటికీ ఎప్పుడు క‌లిసినా వెతుక్కుంటూ వ‌చ్చి మాట్లాడతాడు.న‌న్ను అమ్మ అని హత్తుకుంటాడు.అంతకంటే ప్రేమ ఇంకెక్కడా లేదు.

అది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది.అఖిల్ ఇప్పటికి నాకు చిన్న పిల్లాడిలానే అనిపిస్తాడు.

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ అఖిల్ కి తల్లిగా నటిస్తున్నాను.సిసింద్రీలో అతనితో చేసినపుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో, అఖిల్ ఇప్పుడు హీరో అయిన అలాంటి ఫీలింగ్ అతనిని చూస్తే కలుగుతుందని ఆమని చెప్పుకొచ్చింది.

#MostEligible #Hero Akhil #AmaniPlay #Pooja Hegde #VeteranHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amani Play Mother Role To Akhil Once Again Related Telugu News,Photos/Pics,Images..