చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఆమంచి! వైసీపీ, లేదంటే జనసేన!  

  • చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలుగు దేశం పార్టీని వీడటానికి రెడీ అయ్యాడన్న వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా అతను ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా బాబుతో బేటీ అనంతరం బయటకి వచ్చిన ఆమంచి మీడియాతో ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు. నియోజకవర్గంలో తనకున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించడం జరిగిందని, అయితే పార్టీలో ఉండాలా, లేదా అనేది కార్యకర్తలతో చర్చించిన మీదటే నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం విశేషం.

  • Amanchi Krishna Mohan Going To Join In Janasena Or YCP-Chandrababu Naidu Janasena Party Pawan Kalyan Tdp Ycp

    Amanchi Krishna Mohan Going To Join In Janasena Or YCP

  • అలాగే నియోజక వర్గంలో తనకి తెలియకుండా తన వ్యతిరేకంగా కొన్ని రాజకీయ శక్తులు పని చేస్తున్నాయని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి తనకి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే తన భవిష్యత్తు కార్యాచరణ, కుల సమీకరణాల కోసం తోట త్రిమూర్తులుతో బేటీ కావడం జరిగిందని, ఇక నియోజకవర్గంలో పార్టీ తన అభిమానులు కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు రాజకీయల గురించి నిర్ణయం తీసుకుంటా అని స్పష్టం చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీలో పూర్తిగా సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది. మరి వైసీపీ వర్గాలతో తాను చర్చించడం జరిగిందని, అయితే జగన్ తో బేటీ కావడంపై నిర్ణయం తీసుకోలేదని ఆమంచి చెప్పడం ద్వారా పార్టీ మార్పుపై కొన్ని ఊహాగానాలని ప్రజలకి అందించే ప్రయత్నం చేసారు.