ఆమంచికి... మంచిరోజులు పోయినట్టేనా ...?

ఓడలు బళ్ళు అవ్వడం బళ్ళు ఓడలవ్వడం అంటే ఏంటో ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు బాగా తెలిసొస్తుంది.మొన్నటివరకు అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన వైసీపీలోకి వెళ్లడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

 Amanchi Krishna Mohan Drops His Availabilities In Tdp Party1-TeluguStop.com

ఆయనకు ఎంత నచ్చచెప్పినా వినకుండా పార్టీ మారిపోవడంతో టీడీపీ ఆయన మీద కక్ష తీర్చుకునే పనిలో పడినట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.ఇప్పటివరకు చీరాల నియోజకవర్గం లో తన హావ నడిపించిన ఆయన ఇప్పడు అధికార పార్టీ అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుండడం ఆమంచి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ ఆయనకు కలిసొచ్చే అన్ని అంశాలను దూరం చేసే పనిలో పడింది.

గతంలో తనకు అనుకూలంగా ఉండే పోలీసులు, అధికార్లను ఒక్కొక్కరినీ దూరం చేస్తూ.ఆయనకు చుక్కలు చూపించే పనిలో పడింది.దీనిలో భాగంగానే… ఆమంచికి అనుకూలంగా ఉండే… పోలీసులు, ఇతర అధికారులను చీరాల నుంచి బదిలీ చేసేశారు.చివరికి ఆయన గన్‌మెన్లను కూడా బదిలీ చేయించేయడం ఆయనకు మింగుడుపడడంలేదు.

ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరిన వెంటనే చీరాలలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ స్థాయి అధికారి మొత్తం అందరికి బదిలీలు బహుమానంగా అందేశాయి.

ఈ నేపథ్యంలో ఆమంచి జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా తనకు కేటాయించే గన్‌మెన్లను ప్రభుత్వం ఇంటిలిజెన్స్ ఏజెంట్లుగా వాడుకుంటుంటుందని… దీని కారణంగా … తనకు రాజకీయంగా నష్టం చేకూరుతోంది ఆయన ఆవేదన చెందుతున్నాడు.అందుకే… తాను కోరుకున్న వారినే.గన్‌మెన్లుగా నియమించాలని పట్టుబడుతున్నారు.

అయితే నిబంధనల ప్రకారం గన్‌మెన్లను కేటాయిస్తామని.ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పి ఆయనకు నచ్చచెప్పారు.

ఆయితే.ఆమంచి ఎస్పీని కలిసిన కాసేపటికే చీరాల వైసీపీ ఇంచార్జి.

యడం బాలాజీ ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆమంచి అనుచరుల మీద ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ చేస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆమంచి కృష్ణ మోహన్ కు బాగా తెలిసొస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube