తలచినదే జరిగినదా...? బాబు కి హ్యాండ్ ఇచ్చిన 'ఆమంచి'

ఎన్నో బుజ్జగింపులు… మరెన్నో ట్విస్ట్ ల మధ్య ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు.ఆయన గత కొంతకాలంగా టీడీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు.

 Amanchi Gives Hand To Chandrababu Naidu And Joins In Ycp-TeluguStop.com

అదీ కాకుండా కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇది ముందే పసిగట్టిన బాబు ఆయన్ను బుజ్జగించేందుకు రకరకాలుగా ప్రయత్నించారు.

అయితే అప్పుడు కొంచెం మెత్తబడినట్టే కనిపించారు.కానీ అనూహ్యంగా రాజీనామా చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకి లేఖ రాశారు.‘చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో.ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తులు ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభావాన్ని చూపడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు’ లేఖలో పేర్కొన్నారు.

టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు హైదరాబాద్‌లోని జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌ కు వెళ్లి జగన్ సమక్షంలో ఈరోజు వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం.అయితే ఈ విషయంలో వెంటనే టీడీపీ కూడా రియాక్ట్ అయ్యింది.

చీరాల వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీనియర్‌ నేత కరణం బలరాంను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.దీంతో స్థానిక నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు.

ఆమంచి రాజీనామాతో ఇప్పుడు చీరాలలో టీడీపీ అభ్యర్ది ఎవరనే విషయం చర్చకు వస్తోంది.గత ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసి ఓడి.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీతను టీడీపీ అభ్యర్దిగా ప్రకటించాలా లేక కరణం బలరాం తనయుడికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో అధిష్టానం క్లారిటీ తెచ్చుకునే పనిలో పడింది.

ఇక ఆమంచి విషయానికి వస్తే ….

టీడీపీ ని ఆయన వీడాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా … వెళ్తూ వెళ్తూ … టీడీపీ అధినేత మీద భారీ భారీ విమర్శలే చేశారు.ఇక చంద్రబాబు తో భేటీ సందర్భంగా కూడా నిర్మొహమాటంగా తన మనసులో మాట బయటపెట్టినట్టు ఆమంచి సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటి వరకు….అందరికీ అబద్దపు హామీలు ఇస్తూ….

మోసం చేస్తున్న నేపథ్యంలో మీ మాటలపై ప్రజలకే కాదు పార్టీ నాయకులకు కూడా… నమ్మకం పోయిందని డైరెక్ట్ గా బాబుకి చెప్పేశాడట.అలాగే మాట మీద నిలబడడం… నమ్మకం వంటి విషయాల్లో జగన్ కు మీకు అసలు పోలికే లేదని…

నమ్మిన వారిని గౌరవించడం , నమ్మకంగా చూసుకోవడం వంటి విషయాల్లో రాజశేఖర రెడ్డిని, జగన్ ను చూసి నేర్చుకోవాలని … లోకేష్ కు అయినా… అటువంటి లక్షణాలు నేర్పిస్తే భవిష్యత్‌లో అయినా టిడిపి బాగుపడే ఛాన్స్ ఉందని చంద్రబాబుతో చెప్పాడట ఆమంచి.జగన్‌ నాయకత్వం, జగన్ ఇచ్చిన హామీలపై నమ్మకం ఉందని…మీపై అస్సలు నమ్మకం లేదని మొఖం మీదే చెప్పెయ్యడంతో బాబు షాక్ తిన్నట్టు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube