రూ. 100 లతో సోలార్‌ కుక్కర్‌ తయారు చేసి పేదల కష్టాలు తీర్చాడు, అతడికి జాతీయ అవార్డు

ఇండియాలో అభివృద్ది అనేది అంతట ఒకే విధంగా జరగడం లేదు.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని రిమోట్‌ ఏరియాల్లో అత్యంత వెనుకబడి ప్రజలు ఉన్నారు.

 Aman Makesolar Cooker At Just Rs100 For Tribalwoman Andvillagers Rice-TeluguStop.com

అక్కడ కనీస టెక్నాలజీ లేదా ఇతరత్ర అభివృద్దికి నోచుకోవడం లేదు.ఇంకా కూడా అక్కడ వంట కోసం కట్టెల పోయినే వినియోగిస్తున్నారు.

అక్కడ విద్యుత్‌ కాని, గ్యాస్‌ కాని అందుబాటులో లేదు.ఎంతో అభివృద్ది చెందింది అంటూ చెప్పుకునే గుజరాత్‌లోని కొన్ని రిమోట్‌ ఏరియాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి.

అలాంటి వారిలో ఒకడు అల్జుబెర్‌ సయ్యద్‌.ఈయన తన చుట్టు ఉన్న మహిళలు పడుతున్న కష్టంను చూడలేక పోయాడు.

వారు పదే పదే అనారోగ్యం బారిన పడుతుండటం, చనిపోతుండటం చూసి చలించి పోయాడు.

Telugu Solar Cooker, Solarcooker, Aluminium Plate, India-

మహిళల మరణంకు అధిక కారణం వారు వంట చేసే విధానం అని తెలుసుకున్నాడు.కట్టెల పోయి లేదా కిరోసిన్‌ స్టవ్‌పై వంట చేసే సమయంలో వారు అక్కడ ఎక్కువగా పొగను పీల్చుతున్నారు.ఆ పొగ కారణంగా వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మహిళలు ఎదుర్కొంటున్న వంట చేసే విధానం సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాడు.అంత కూడా చాలా పేద వారు.

వారికి ఖర్చు లేకుండా కొత్త తరహా వంట చేసుకునే విధానం తీసుకు రావాలనుకున్నాడు.అనుకున్నదే తడువుగా అతడు అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు చేశాడు.

సూర్యరశ్మి ద్వారా ఎలా వంట చేయవచ్చో పరిశీలించాడు.

చాలా రోజుల ప్రయత్నాల తర్వాత అతడి ప్రయత్నం ఫలించింది.

కేవలం 100 రూపాయల లోపు ఖర్చుతో సోలార్‌ రైస్‌ కుక్కర్‌ను తయారు చేయడం జరిగింది.అతడు చేసిన రైస్‌ కుక్కను ప్రతి ఒక్కరు వారి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.

ఆ రైస్‌ కుక్కర్‌కు కవాల్సింది ఒక అల్యూమీనియం రేకు మరియు ఒక అల్యూమీనియం గిన్నె కాస్త నల్ల రంగు.ఇంతకు మించి కుక్కర్‌కు ఏమీ అక్కర్లేదు.

నల్ల రంగును అల్యూమీనియం గిన్నెకు బయట వైపు నుండి పూర్తిగా కోటింగ్‌ చేయాలి.ఆ తర్వాత అల్యూమీనియం రేకును ఒక బాక్స్‌ తరహాలో వంచుకోవాలి.

ఆ రేకులో అల్యూమీనియం గిన్నె పట్టే విధంగా అమరిక ఉండాలి.

అల్యూమీనియం గిన్నెలో బియ్యం కడిగి సరిపోను వాటర్‌ పోసి దానికి ఒక పల్చటి ప్లాస్టిక్‌ కవర్‌ను పెట్టి అల్యూమీనియంతో రేకుతో తయారు చేసిన బాక్స్‌లో పెట్టుకోవాలి.

దాన్ని ఎండలో పెట్టుకోవడంతో గంట నుండి రెండున్నర గంటల్లో అన్నం అవుతుంది.మనం పెట్టిన బియ్యం పరిమాణంను బట్టి సమయం పడుతుంది.ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా అన్నం తయారు అవుతుంది.ఇక ఈ విధానంలో తయారు అయిన అన్నం తినడం వల్ల చాలా లాభాలున్నాయని సయ్యద్‌ అంటున్నాడు.

అన్నం వండే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఎక్కువ సమయం ఎండలో ఉంచినా కూడా అన్నం మాడిపోవడం అనే ముచ్చట లేదు.

సయ్యద్‌ కనిపెట్టిన ఈ సోలార్‌ రైస్‌ కుక్కర్‌ ప్రస్తుతం గుజరాత్‌ లోని ఆ రిమోట్‌ ఏరియాలోని దాదాపు 110 గ్రామాల్లో వాడుతున్నారు.స్వయంగా సయ్యద్‌ తిరిగి తన కుక్కర్‌ ప్రయోజనాలను తెలియజేశాడు.

ఫ్రీగా అందరికి తయారు చేసి పెట్టాడు.సయ్యద్‌ చేసిన ఈ విభిన్నమైన ప్రయోగంకు పలు అవార్డులు రివార్డులు వచ్చాయి.

అతడు ముందు ముందు మరిన్ని ఇలాంటి ప్రయోగాలు చేసి పేద ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుకుందాం.మీ చుట్టు కూడా ఇలాంటి విభిన్నమైన ప్రయోగాలు చేసిన వారు ఉండే ఉంటారు.

మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే వారి గురించి మాకు కామెంట్స్‌ రూపంలో చెప్పండి.తప్పకుండా వారిని ప్రోత్సహిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube