తెలంగాణలో కొత్త వాహన చట్టం ఎఫెక్ట్‌ అతడికి రూ.10 వేలు ఫైన్‌

దేశ వ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చింది.ఈ చట్టం మేరకు హెల్మెట్‌ లేకుంటే 100 రూపాయలు ఉండే ఫైన్‌ వెయ్యికి పెంచారు.

 Aman Arrestedin Drunkand Drive Ts-TeluguStop.com

ఇలా పలు రకాల ఫైన్స్‌ను భారీగా పెంచారు.ఇప్పటి వరకు ఈ ఫైన్స్‌ గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.

కాని ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రం పెద్దగా ఈ విషయమై ప్రచారం జరగడం లేదు.అంటే కొత్త ట్రాఫిక్స్‌ రూల్స్‌ చట్టం ఇక్కడ అమలు కావడం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.తాజాగా నల్లగొండ జిల్లాలో ఈ కొత్త చట్టం కింద ఫైన్‌ ఏకంగా రూ.10 వేలు పడింది.

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించిన పోలీసులకు ఒక వ్యక్తి తాగి పట్టుబడ్డాడు.దాంతో ఆ వ్యక్తిని పోలీసులు పక్కకు ఆపి బండి తీసుకున్నారు.

ఈ కేసు కాస్త కోర్టుకు వెళ్లింది.కోర్టులో విచారణ జరిపిన జడ్జీ కొత్త చట్టం మేరకు అతడికి ఏకంగా 10 వేల జరిమాన కట్టాలని శిక్ష విధించాడు.

జరిమానాకు డబ్బులు లేవు అంటే 15 రోజుల సాదారణ జైలు శిక్షను అనుభవించాల్సిందిగా తీర్పు ఇచ్చాడు.దాంతో అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ముందు ముందు ఇలాంటి కేసులు ఎన్ని నమోదు అవుతాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube