అమలాపురం టికెట్ కోసమే టీడీపీలో చేరానని ఒప్పుకున్న హర్ష కుమార్!  

టీడీపీలో టికెట్ కోసమే చేరినట్లు స్పష్టం చేసిన అమలాపురం మాజీ ఎంపీ. .

Amalapuram Ex Mp Harshakumar Sensational Comments On Tdp-harshakumar,janasena,sensational Comments On Tdp,ysrcp

రాజకీయాలలో ఎప్పటికప్పుడు కండువాలు మార్చేసే నాయకులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. వారి అవసరాల కోసం పార్టీ కండువా మార్చేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆ పార్టీలో చేరానని, నియోజక వర్గ అభివృద్ధి కోసమే చేరా అని, అలాగే తమ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీలో చేరా అంటూ కలరింగ్ ఇస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతారు అనే విషయం అందరికి తెలుసు..

అమలాపురం టికెట్ కోసమే టీడీపీలో చేరానని ఒప్పుకున్న హర్ష కుమార్!-Amalapuram Ex MP Harshakumar Sensational Comments On TDP

ఇదిలా ఉంటే ఎన్నికల ముందు మాజీ పార్లమెంటు సభ్యుడు జి.వి. హర్షకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరి రెండో రోజే మరల పార్టీని వీడిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు వైసీపీ లో చేరిపోయిన హర్ష కుమార్ వినూత్నంగా తెలుగు దేశం పార్టీ తనని హత్య చేయడానికి కుట్ర చేస్తుందని చెప్పుకొచ్చారు. తన కారు చక్రాల నట్టులను తీసి హత్యచేయడానికి తెలుగుదేశం పార్టీనేతలు ప్రయత్నించారన్నారు. సామాజిక న్యాయం కోసం తాను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరానని, అయితే తనకు అమలాపురం టిక్కెట్ ఇస్తామనిచెప్పి మోసం చేయడంతో తాను ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు.

ఇక ఆయన మాటలలో అసలు పసుపు కండువా ఎందుకు కప్పుకున్నది స్పష్టం చేసి రాజకీయాలలో ఇదైనా వస్తుందంటేనే కండువాలు మారుస్తారు అని నిరూపించారు.