దర్శకుడు అడగలేదు, అంతా నేను చేశాను అంటున్న అమలాపాల్  

Amalapaul Speak About Adai Movie-

హీరోయిన్స్ ఏమి చేసినా కూడా సోషల్ మీడియా లో అవి వైరల్ అవుతూనే ఉంటాయి.సినిమాల కోసం వారు చేసే కొన్ని కొన్ని సీన్స్,అలానే ఫంక్షన్స్ లో వారు వేసుకొనే డ్రస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వైరల్ న్యూస్ అవుతుంటుంది.అయితే ఇటీవల హీరోయిన్ అమలాపాల్ నడిచిన ‘ఆడై’ చిత్రానికి సంబందించిన ఒక పోస్టర్ విడుదల అయిన సంగతి తెలిసిందే.అయితే ఆ పోస్టర్ లో అమలాపాల్ బోల్డ్ గా కనిపించడం తో నెటిజన్లు తెగ చూస్తూ కామెంట్లు పెట్టారు..

Amalapaul Speak About Adai Movie--Amalapaul Speak About Adai Movie-

క్షణాల్లో ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే అదంతా నేను చేశాను,నన్ను దర్శకుడు డిమాండ్ చేయలేదు అంటూ తాజాగా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.దర్శకుడు రత్నకుమార్ స్టోరీ చెప్పినప్పుడు తనకే నగ్నంగా నటించాల్సిన అవసరం ఉందని అనిపించి ఆలా చేసిందట.అయితే మొదట డైరెక్టర్ కేవలం కాస్ట్యూమ్స్ ద్వారా మెసేజ్ చేస్తే సరిపోతుంది నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు అని అన్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం లేదు నేను సహజంగా ఉండాలన్న ఉద్దేశ్యం తో అలా బోల్డ్ గా నటించాల్సి వచ్చింది అంటూ తెగ క్లారిటీ ఇచ్చేస్తుంది.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించాం అని చెప్పే నటులను చూశాము కానీ ఇలా కధ విని తానే అలా నటించాలని అనుకున్నట్లు చెప్పిన నటి అమలాపాల్ మాత్రమేనెమో అనుకోవాలి.అయితే ఆ సీన్స్ చేసేప్పుడు అన్ని జాగ్రత్తలలు తీసుకున్నామని, అవసరమైన అతి తక్కువమంది క్రూ మెంబర్స్ మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ ముద్దు గుమ్మ చెప్పుకొచ్చింది.‘ఆడై’ అనే చిత్రం తెలుగు లో ‘ఆమె’ పేరుతో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.