అక్కినేని కపుల్స్‌ కలిసి నటించబోతున్నారట... రెండు దశాబ్దాల తర్వాత ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ  

అక్కినేని కపుల్స్‌ నాగచైతన్య, సమంత కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నారు కదా, దీన్ని మళ్లీ ప్రత్యేకంగా చెప్పడం ఏంటీ, అది కూడా రెండు దశాబ్దాల తర్వాత అంటున్నారేంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా.. మేము అన్న అక్కినేని కపుల్స్‌ నాగచైతన్య, సమంత కాదండీ… నాగార్జున, అమల. అవును వీరిద్దరు కలిసి ‘మన్మధుడు 2’ చిత్రంలో నటించబోతున్నారు. భారీ అంచనాల నడుమ మన్మధుడు 2 చిత్రం ప్రారంభం కాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

హీరోగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ చిత్రం రాబోతుంది. గతంలో వచ్చిన మన్మధుడుకు ఈ మన్మధుడుకు ఎలాంటి పోలికలు ఉండవు. కాని టైటిల్‌ మన్మధుడు అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

Amala To Act In Nagarjuna's Manmadhudu 2 Movie-Director Rahul Ravindran Manmadhudu Movie Nagarjuna Payal Rajput

Amala To Act In Nagarjuna's Manmadhudu 2 Movie

ఈ చిత్రంలో హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పూత్‌ నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే అమల కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మన్మధుడు 2 చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌ గత చిత్రం చిలసౌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మన్మధుడు 2 చిత్రం కూడా నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయేలా రాహుల్‌ తీస్తాడనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమలా నటిస్తే సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఆమె నిలుస్తుందని, నాగార్జున, అమలల కాంబో సీన్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. మనం సినిమాలో అమలా కనిపించినా కూడా నాగార్జునతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. అందుకే ఈసారి మన్మధుడు 2లో వీరి జంట కనువిందు చేయనుందని అనిపిస్తోంది.