నా బొడ్డు వలన ఇంత హంగామా జరుగుతుంది అనుకోలేదంటున్న అమలాపాల్     2017-11-27   02:14:44  IST  Raghu V

అదేమిటో తెలియదు కాని, స్త్రీ యొక్క నడుము – నాభి అందాలకి కొన్ని వేల ఏళ్ళుగా దాసోహం అంటూనే ఉన్నారు మగవారు. అందుకే, ఈ బలహీనతని దృష్టిలో పెట్టుకోని, హీరోయిన్ నాభి అందాన్ని ఓ ఆకర్షణ లా చూపెట్టడం ఓ ట్రెండుగా మార్చుకున్నారు సినిమావారు. అక్కడ పూలు పళ్ళు పెడతారు, నాభి మీదే పాటలు రాస్తారు ఇంకా చెప్పాలంటే సీన్ కి సంబంధం లేకపోయినా, అక్కడే క్లోజప్ పెడుతూ షాట్స్ తీస్తారు. చెప్పాలంటే, ఈమధ్య ఇలాంటి ట్రెండ్ తగ్గింది. ఇప్పుడు అమలాపాల్ నాభి మళ్ళీ ట్రెండ్ ని వెనక్కి తీసుకొచ్చినంత పనిచేసింది.

అమలాపాల్ కొత్త తమిళ సినిమా పేరు “తిరుత్తుపాయలే 2”. నవంబర్ 30న విడుదల కాబోతున్న ఈ సినిమాకి తమిళనాట చాలా హైప్ ఏర్పడింది. దానికి కారణం, హీరోనో లేక సినిమా ట్రైలరో అనుకునేరు. ఆ హైప్ కి కారణం ఒక పోస్టర్, అందులో నాభి అందాన్ని చూపిస్తున్న అమలాపాల్. ఇంతకుముందు అమాలా నడుమందాలను బయటపెట్టలేదు అని కాదు, పెళ్ళి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక అమలా తొలిసారి గ్లామరస్ గా కనిపించేసరికి కుర్రాళ్ళకి స్పెషల్ గా అనిపించింది. ఈ రెస్పాన్స్ చూసి, అమలాపాల్ నాభి అందాలతో మరికొన్ని పోస్టర్స్ కూడా వదిలారు. అలా ఉంది డిమాండ్ మరి.

దీనిపై అమలాపాల్ మాట్లాడుతూ ” నా బొడ్డు ఇంత హంగామా సృష్టిస్తుంది అనుకోలేదు. ఇంత హైప్ వస్తుందని, అది కూడా ఇలా చిత్రమైన కారణంతో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇది 2017. రోజుకి ఎన్నో వార్తలు వింటుంటారు. వీటిన్నిటి మధ్య నా బొడ్డు సెన్సేషన్ అవడం విచిత్రం. ఈ సినిమాలో నేను ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉన్న మహిళగా నటిస్తున్నాను. పోస్టర్స్ లో ఆ విశ్వాసమే జనాలకి అర్థమవుతుంది అనుకున్నాను. కాని అందరి చూపు వేరే వైపుకి వెళ్ళింది” అంటూ చెప్పుకొచ్చింది అమలా.

తమిళంలో డిమాండ్ ని చూసి, ఈ సినిమాని దొంగోడొచ్చాడు పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. మరి అమాలా నాభి మ్యూజిక్ తెలుగు జనాల మీద కూడా పనిచేస్తుందా లేదా చూడాలి.