బికినీ వీడియో షేర్ చేసిన అమలా పాల్.. మూడో భర్తతో వెకేషనా అంటూ?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ నటిగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువ పరిచయాన్ని పెంచుకుంది.

 Amala Paul Shares Bikini Video Viral Social Media,amala Paul ,amala Paul  Maldiv-TeluguStop.com

తన అందంతో బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కూడా నటించింది.ఇక తెలుగులో కేవలం కొన్ని సినిమాలలో నటించగా ఆ తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాల్లో కూడా కనిపించలేదు.

తొలిసారిగా 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.2013లో నాయక్ సినిమాలో నటించగా ఆ తర్వాత అదే ఏడాది ఇద్దరమ్మాయిలు సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత జెండాపై కపిరాజు సినిమాలో నటించగా.అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.ఇక అమలాపాల్ తన విడాకుల విషయంలో బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ పెళ్లి చేసుకోగా.

నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది.ఇక ఇటీవలే ఆమె ఓ యువ సింగర్ భరిందర్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా కొన్ని ఫోటోలు బయటకు రావడంతో వాళ్లకు పెళ్లి కూడా జరిగిందని వార్తలు వినిపించాయి.

కానీ వాటిని అమలాపాల్ పక్కకు తోసి పుచ్చింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో నిత్యం ఏదో ఒక ఫోటో పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.

ఇక ప్రస్తుతం తను పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.ఇటీవల ఆమె నటించిన ‘కడవర్’ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదలైంది.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.ఇదంతా పక్కన పెడితే రెండు విడాకులు అయ్యాక కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోను మాత్రం ఆపట్లేదు.

ఒకప్పుడు టాలీవుడ్ లో తను ట్రెడిషనల్ పాత్రలలో కనిపించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందింది.కానీ తన వ్యక్తిగతం వల్ల ఆ అభిమానాన్ని కోల్పోయింది.పైగా బాగా బోల్డ్ గా కనిపించడంతో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.అయినా కూడా తన గ్లామర్ షోను మాత్రం ఆపట్లేదు.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా బోల్డ్ వీడియో షేర్ చేసుకుంది.

అందులో బికినీలో కనిపించగా తను ఎక్కడో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.ఇక అందులో పలు షూట్ లను కలిపి వీడియో తీయగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ బాగా కామెంట్స్ చేస్తున్నారు.

మూడో భర్త తో వెకేషనా అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube