రెండో పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్....

టాలీవుడ్ లో 2013వ సంవత్సరంలో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో అనే చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే ఉంటుంది.అయితే నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఈ అమ్మడు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ అభిమానులను బాగానే సంపాదించుకుంది.

 Amala Paul Second Marriage Photos Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా అమలాపాల్ కి సంబంధించిన కొన్ని పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే ఇటీవలే అమలాపాల్ బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సింగర్ ని  వివాహం చేసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేకాక ఇందుకు సంబంధించి నటువంటి పెళ్లి ఫోటోలు కూడా నెట్లో దర్శనమిస్తున్నాయి.అయితే ఇంతకీ ఈ పెళ్లి ఫొటోలో కనిపిస్తున్న ఆ సింగర్ ఎవరు అంటే భవిందర్ సింగ్.

ఇతడు బాలీవుడ్ లోని పలు చిత్రాలకు బేస్డ్ సింగర్ గా పనిచేశాడు.ఉన్నట్లుండి అమలాపాల్ రెండో పెళ్లి ఫోటోలు నెట్ లో ప్రత్యక్షం అవడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

అంతేకాక ఇటీవలే తన మొదటి భర్త ఏఎల్ విజయ్ కుమార్ తో విడాకులు తీసుకుంది.అంతలోనే మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది.అయితే ఈ విషయాన్ని నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేకాక మరికొందరైతే గతంలో మాదిరిగా మనస్పర్థల కారణంగా విడిపోకుండా జీవితాంతం సంతోషంగా జీవించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Amala Paul, Amalapaul-Latest News - Telugu

అయితే వివాహానికి కోలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు హాజరు కానట్లు తెలుస్తోంది.అంతేగాక అమలాపాల్ కి సంబంధించినటువంటి దగ్గర బంధువులు కొందరు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం.అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఈ అమ్మడు నటించిన టువంటి “ఆమె” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ప్రస్తుతం అమలాపాల్ తెలుగు తమిళంలో భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాల్లోకి పైగా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube