ఆ హీరోయిన్‌ చేసుకున్నది ఉతుత్తి పెళ్లి అంటా..!

మూడు నాలుగు రోజులుగా హీరోయిన్‌ అమలాపాల్‌ పెళ్లి విషయమై వార్తలు తారా స్థాయిలో వస్తున్నాయి.దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్‌ కొన్నాళ్లకే ఆయన నుండి విడాకులు తీసుకుంది.

 Amala Paul Second Marriage Bhavinder Singh Rumors-TeluguStop.com

పెళ్లి తర్వాత సినీ కెరీర్‌కు ఇబ్బందిగా ఉందనే ఉద్దేశ్యంతో ఆమె విడాకులు తీసుకుందనే ప్రచారం జరిగింది.కాని ఆ విషయమై ఎలాంటి క్లారిటీ అయితే లేదు.

ఇక విజయ్‌ పెళ్లి చేసుకోగా తాజాగా అమలాపాల్‌ కూడా పెళ్లికి సిద్దం అయ్యిందని వార్తలు వచ్చాయి, తాజాగా పెళ్లి ఫొటోలు మీడియాలో రావడంతో అంతా కూడా పెళ్లి చేసుకుందని అనుకున్నారు.

పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో లీక్‌ చేసిన అమలా పాల్‌ మూడు నాలుగు రోజుల తర్వాత అవి కేవలం ఉతుత్తి పెళ్లి ఫొటోలు అంటూ నీరు గార్చేలా క్లారిటీ ఇచ్చింది.

గాయకుడు భగత్‌ సింగ్‌ ఈ ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు.అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్‌ చేశాడు.అయితే అప్పటికే అవి కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.చాలా మంది వాటిని డౌన్‌లోడ్‌ చేయడం వల్ల అవి కాస్త సంచలనంగా మారాయి.

Telugu Amala Paul, Bhavinder Singh, Divorce, Vijay-Movie

ఆ ఫొటోలను చూస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగానే ఉంది.మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమలా పాల్‌ క్లారిటీ ఇచ్చింది.తనకు సంబంధించిన ఒక కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా యాడ్‌ చిత్రీకరణ చేశాం.ఆ యాడ్‌ సందర్బంగా తీసుకున్న ఫొటోలు తప్ప అది పెళ్లి కాదని క్లారిటీ ఇచ్చింది.

అమలా పాల్‌ లేట్‌ రెస్పాండ్‌కు అంతా అవాక్కవుతున్నారు.ఇప్పటికే చాలా మంది పెళ్లి గురించి పలు రకాలుగా అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఈమె స్పందించడం విడ్డూరంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube