విడాకుల తర్వాత మరో బాయ్ ఫ్రెండ్ ని పట్టేసిన అమలాపాల్  

Amala Paul Reveal Date With New Boy Friend-

ప్రేమఖైదీ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ భామ అమలాపాల్.మొదటి సినిమాతోనే నటిగా తనని తాను నిరూపించుకున్న అమలాపాల్ తమిళంగా తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలోనే ఊహించని విధంగా దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది..

Amala Paul Reveal Date With New Boy Friend--Amala Paul Reveal Date With New Boy Friend-

ఇక అతనితో కాపురం చేసి ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకొని మరో సారి సంచలనంగా మారిన అమలాపాల్ తరువాత కోలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది.అయితే కొంత కాలం అనుకున్న స్థాయిలో ఈ భామకి అవకాశాలు రాకపోయినా తర్వాత మాత్రం మరల మంచి అవకాశాలు అందుకుంది.గత సంవత్సరం రాచ్చసన్ అనే సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న అమలాపాల్ తాజాగా ఆమె అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక ఈ సినిమాలో ఊహించని విధంగా న్యూడ్ సన్నివేశాలలో నటించి సంచలనం సృష్టించిన అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.తాను ప్రస్తుతం ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని, అతను తన కోసం ఏకంగా చేస్తున్న ఉద్యోగం మానేసి నాతో ఎక్కువ సమయం గడుపుతున్నాడని చెప్పింది.ఇక ఈ సినిమాలో న్యూడ్ సన్నివేశాలు చేయడానికి ముందుగా భయపడిన అతనే ధైర్యం చెప్పి మరీ చేయించాడని చెప్పింది.

బాయ్ ఫ్రెండ్ సహకారంతో తాను ఈ సినిమాలో అంత బోల్డ్ సన్నివేశాలు చాలా ఈజీగా చేసేసానని అమలాపాల్ చెప్పింది.ఇక ఆమె తాను డేటింగ్ లో ఉన్న విషయం ఓపెన్ చేయడం ద్వారా మరల త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది అనే కామెంట్ ఇప్పుడు వినిపిస్తుంది.