అలాంటి పాత్రల్లో నటిస్తానన్న అమలాపాల్.. అవాక్కైన దర్శకులు..?

పిట్టకథలు వెబ్ సిరీస్ లో చిన్న పాత్రలో నటించి ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో వ్యక్తిగత విషయాల గురించి స్పందించడం ద్వారా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు అమలాపాల్.తెలుగులో అమలాపాల్ కు అవకాశాలు లేకపోయినా తమిళంలో, ఇతర భాషల్లో అమలాపాల్ కు అవకాశాలు బాగానే వస్తున్నాయి.

 Amala Paul No Conditions For Romantic Scenes-TeluguStop.com

తెలుగులో మెగా హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించిన అమలాపాల్ కిస్ సీన్లు ఉన్న పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

పిట్టకథలు వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించిన అమలాపాల్ ఇకపై డేరింగ్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

 Amala Paul No Conditions For Romantic Scenes-అలాంటి పాత్రల్లో నటిస్తానన్న అమలాపాల్.. అవాక్కైన దర్శకులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ గుర్తింపును సంపాదించుకున్న రాధికా ఆప్టే తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని అమలా పాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.సినిమాలతో పాటు ఓటీటీలు, వెబ్ సిరీస్ లలో నటించే దిశగా అమలాపాల్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

పెళ్లి తరువాత కూడా అమలాపాల్ కిస్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకులు అవాక్కైనట్లు తెలుస్తోంది.తెలుగు దర్శకులు కూడా అమలాపాల్ కు మూవీ ఆఫర్లు ఇస్తారేమో చూడాల్సి ఉంది.నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అమలా పాల్ తెలుగులో నటించిన సినిమాల్లో నాయక్ మినహా మరే సినిమా సక్సెస్ కాలేదు.ఎక్కువ విజయాలు లేకపోవడం వల్లే అమలా పాల్ కు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.

మరోవైపు మొదటి భర్తతో విడిపోయిన అమలా పాల్ రెండో పెళ్లి గురించి ఆలోచనలు చేయడం లేదు.సినిమాలతోనే బిజీ అవుదామని ప్రయత్నాలు చేస్తున్న అమలాపాల్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

అమలాపాల్ నటించిన పిట్టకథలు వెబ్ సిరీస్ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

#Amala Paul #No Conditions #Kiss Scenes #Romantic Scenes #AmalaPaul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు