ఫొటోటాక్ : సక్కనమ్మ చాలా చిక్కిందే

తెలుగు లో స్టార్‌ హీరోలు అల్లు అర్జున్ మరియు రామ్‌ చరణ్ లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ అమలా పాల్‌.ఈ అమ్మడు కెరీర్‌ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుంది.

 Amala Paul New Photos Goes Viral ,amala Paul, Tollywood, Kollywood, New Photo-TeluguStop.com

అయితే అనూహ్యం గా అతడి నుండి కొంత కాలంకే విడి పోయింది.భర్త కు విడాకులు ఇచ్చి మళ్లీ సింగిల్ అయిన అమలా పాల్‌ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నించింది.

తమిళంలో అడపా దడపా ఆఫర్లు వచ్చాయి.తెలుగు నుండి వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి.

కాని స్టార్‌ హీరోల కు జోడీ గా మాత్రం ఈఅమ్మడికి ఆఫర్లు రావడం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న కొన్ని సినిమాల్లో ఈమె ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ అలా అలా కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.కాని ఈమెకు లక్‌ కలిసి రాక పోవడంతో పెద్ద హీరోలు మాత్రం పిలవడం లేదు.

స్టార్‌ హీరోల నుండి పిలుపు కోసం ఈ అమ్మడు తాజాగా బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది.

బరువు తగ్గిన ఈ అమ్మడు ఫొటో లకు ఫోజులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది.

ముద్దుగుమ్మ చిక్కినా కూడా చక్కగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ అమ్మడి కొత్త వెబ్‌ సిరీస్ ను త్వరలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్‌ కోసం అమలా పాల్ చేస్తున్న హడా వుడి అంతా ఇంతా కాదు.

తెలుగులో ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో ఈమెకు నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయట.ఆ విషయమై ఆమె ఓకే చెప్పేందుకు కాస్త వెనుక ముందు ఆడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube