విడాకులు తీసుకున్నాక మళ్లీ ప్రేమలో పడకూడదా, తిరగకూడదా?  

Amala Paul Latest Update About Love With Bhavindar Singh - Telugu Amala Pal In Press Meet, Amala Paul, Amala Paul And Bavindhar Singh, Amala Paul Get Divorce From Vijay, Vijay And Amala Paul

హీరోయిన్‌ అమలా పాల్‌ దర్శకుడ విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ప్రేమలో మూడు సంవత్సరాలు ఉన్న ఈ అమ్మడు పెళ్లి అయిన తర్వాత కనీసం ఒక్క సంవత్సరం అయినా ఉండలేదు.

 Amala Paul Latest Update About Love With Bhavindar Singh

ఈ జంట పెళ్లి అయిన కొన్ని నెలలకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు.వీరి పెళ్లి పెటాకులు అయ్యింది.

అధికారికంగా విడాకులు తీసుకున్నారు.ప్రస్తుతం ఎవరి జీవితాలు వారు గడిపేస్తున్నారు.

విడాకులు తీసుకున్నాక మళ్లీ ప్రేమలో పడకూడదా, తిరగకూడదా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సమయంలో అమలాపాల్‌ గురించిన వార్తలు గత కొంత కాలంగా వస్తున్నాయి.

విడాకుల తర్వాత ఈ అమ్మడు మళ్లీ ప్రేమలో పడ్డట్లుగా ప్రచారం జరిగింది.ఆ వార్తలను కొట్టి పారేసినా కూడా తరచు వస్తూనే ఉన్నాయి.తాజాగా ఈమె పంజాబీ కుర్రాడు భవీందర్‌ సింగ్‌తో ప్రేమలో పడి మునిగి తేలుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆ విషయమై ఇంకా ఆమె నుండి క్లారిటీ అయితే రాలేదు కాని తాజాగా ఈ విషయం ఆమెను ఆఫ్‌ ది రికార్డ్‌ అడిగేందుకు ప్రశ్నించగా ఆశ్చర్యకరంగా స్పందించిందట.

పెళ్లి అయ్యి విడాకులు అయిన తర్వాత సింగిల్‌గానే ఉంటాం కదా.అప్పుడు ప్రేమలో పడకూడదా, ప్రేమలో ఉన్నప్పుడు తిరగకూడదా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించిందట.ఆమె ప్రశ్నకు ఎదుటి వ్యక్తి నోరు వెళ్లబెట్టాడాట.

విడాకులు అయ్యాయి అని ఏడ్చుకుంటూ కూర్చోం కదా మళ్లీ పెళ్లి చేసుకుంటాం.అది ప్రేమ పెళ్లి అయ్యి ఉండవచ్చు లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయ్యి ఉండవచ్చు అంది.

భవీందర్‌ సింగ్‌ గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం ఆమె నోరు విప్పలేదట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test