సినిమాలు కంప్లీట్ అవగానే పెళ్లి డేట్ ప్రకటిస్తా... అమలాపాల్ కీలక వాఖ్యలు

సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అమలాపాల్.చేసినని తక్కువ సినిమాలే అయిన నటిగా మాత్రం తన ముద్ర వేసుకుంది.

 Amala Paul Gives Clarity On Marriage Rumors, Tollywood, Kollywood, Bollywood, So-TeluguStop.com

వరుస సినిమాలతో కెరియర్ మంచి జోష్ లో ఉన్నప్పుడు దర్శకుడు ఎ ఎల్ విజయ్ ని పెళ్లి చేసుకున్న ఈ బుట్టబొమ్మ రెండేళ్ళు కూడా కాపురం చేయకుండానే అతనితో విడిపోయింది.అయితే అత్తారింటిలో సినిమాలు చేయవద్దని ఆమెకి చెప్పడం, ఆమె మాట వినకపోవడంతో వారు విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత మరల వరుసగా అవకాశాలు అందుకొని తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మరల ముంబాయికి చెందిన గాయకుడు బవీందర్ సింగ్ తో ప్రేమలో పడింది.

కొద్ది రోజుల క్రితం వీరిద్దరికి సంబందించిన పెళ్లి ఫోటోలు బయటకి రావడంతో వారు పెళ్లి చేసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాము పెళ్లి చేసుకోలేదని, ఒక ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోలని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.ఈ నేపధ్యంలో మరల ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలా మంది పదే పదే ప్రస్తావిస్తూ ఉండటం తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది.

తాజాగా రెండో పెళ్లిపై అమలాపాల్ ని ప్రశ్నించగా నా పెళ్లికి ఇంకా సమయం ఉంది.ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నా.

సినిమా షూటింగ్స్ పూర్తయితే నా పెళ్లి గురించి ప్రకటిస్తా.ఇప్పటికే నా ప్రియుడి గురించి చెప్పేశా.

కాబట్టి వివాహం గురించి కూడా చెబుతా.సమయం వచ్చినపుడు నేను పెళ్లి గురించి అన్ని విషయాలు మీతో పంచుకుంటా అంత వరకు సైలెంట్ గా ఉండండి అంటూ చెప్పింది.

మొత్తానికి రెండో పెళ్లి విషయంలో ఈ అమ్మడు మొదటి సారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube