ఆ స్టార్ డైరెక్టర్ జీవితంలో అమలాపాల్ రచ్చ.. అసలు ఏం జరిగిందంటే?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.

 Amala Paul In That Star Director Star Director What Actually Happened, Amala Pau-TeluguStop.com

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే కెరియర్ లో ఎంతో అద్భుతంగా రాణించిన అమలాపాల్ అంతే తొందరగా తన కెరీర్ ను నాశనం చేసుకుంది అని చెప్పవచ్చు.తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాగచైతన్య సరసన బెజవాడ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సరసన నాయక్, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే చిత్రాలలో నటించారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ దర్శకుడితో ప్రేమలో పడి తనని వివాహం చేసుకొని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే ఆ దర్శకుడితో అంతే తొందరగా విడాకులు తీసుకొని తిరిగి ఇండస్ట్రీ రీ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే ‘రంజిష్‌ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో వూట్‌ ద్వారా జనవరి 13వ తేదీ (నేటి) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో విడుదల చేసిన ఒక ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో అమలాపాల్ మద్యానికి, ధూమపానానికి బానిసైన మహిళగా కనిపిస్తారు.

అయితే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ నిర్మాత డైరెక్టర్ మహేష్ బట్ జీవితం ఆధారంగా తెరకెక్కినది.ఇందులో అమలాపాల్ నటి పర్విన్‌ బాబీ పాత్రలో నటించారు.

ఇక అమలాపాల్ ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను నిర్మాత మహేష్ భట్ నిర్మించారు.ఇందులో సుమారు 50 శాతం కథాంశం మహేష్ భట్ జీవిత ఆధారంగా తెరకెక్కిందని చెప్పవచ్చు.ఒక దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బట్ జీవితంలోకి రావడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అదే విధంగా ఈ సిరీస్ లో అమలాపాల్ దర్శకుడు జీవితంలో ఎలాంటి రచ్చ చేసింది అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సిరీస్ పై అంచనాలు పెరిగాయి.మరి నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

Amala Paul Starrer Ranjish Hi Sahi Hindi Web Series Trailer Viral

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube