తమిళ స్టార్ బ్యూటీ అమలా పాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.తమిళ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్న ఈ హీరోయిన్ తండ్రి పాల్ వర్గీస్ కన్నుమూశారు.61 ఏళ్ల వయుసున్న ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
అమలా పాల్ తండ్రి మరణ వార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.పలువురు సినీ ప్రముఖులు ఆమె తండ్రి మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపారు.
తన కూతురు సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేని పాల్ వర్గీస్‌ను అమలా పాల్ ఒప్పించి మరీ ఈ స్థాయికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా ఆమె వైవాహిక జీవితం పట్ల పాల్ వర్గీస్ చాలా ఆందోళన చెందేవారని తెలుస్తోంది.
అమలా పాల్ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది.ఆమె తండ్రి మరణవార్తతో అమలా పాల్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కాగా బుధవారం సాయంత్రం కురుప్పంపాడులో పాల్ వర్గీస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.