తండ్రైన అమలా పాల్ మాజీ భర్త

తమిళంలో తన యాక్టింగ్‌తో పాటు అందంతో కూడా ప్రేక్షకులను సంపాదించుకున్న బ్యూటీ అమలా పాల్, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ బ్యూటీ ధనుష్‌తో కలిసి నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యిందని చెప్పాలి.

 Amala Paul Ex Husband Al Vijay Becomes Father, Amala Paul, Al Vijay, Ex Husband,-TeluguStop.com

కాగా తన ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నంత సాఫీగా తన పర్సనల్ లైఫ్ లేదనే వాస్తవాన్ని అమ్మడు ఇప్పటికే ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

తమిళంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ.2014లో విజయ్‌ను అమలా పాల్ కుటుంబ సభ్యుల ఒప్పందంతో పెళ్లి చేసుకుంది.అయితే ఆమె పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా నిలిచింది.2017లో తన భర్త ఏఎల్ విజయ్‌తో అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది ఈ చిన్నది.అయితే విజయ్ మాత్రం గతేడాది జూలైలో డాక్టర్ ఐశ్వర్య అనే అమ్మాయిన పెళ్లి చేసుకున్నాడు.

తాజాగా మే 30న విజయ్ దంపతులకు ఓ మగబిడ్డ జన్మించాడు.దీంతో విజయ్ తండ్రి అయ్యాడంటూ ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

అటు అమలా పాల్ మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తూ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

అటు విజయ్ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో తలైవి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube