బాలయ్య సినిమాలో ఆమె.. ఏమౌతుందో?  

Amala Paul In Balakrishna Movie, Amala Paul, Balakrishna, Boyapati Srinu, Tollywood News - Telugu Amala Paul, Balakrishna, Boyapati Srinu, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

 Amala Paul Balakrishna Boyapati Srinu

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్ర వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

బాలయ్య లాంటి హీరో పక్కన ఓ సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది.ఇప్పటికే ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్‌ను తీసుకున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాలయ్య సినిమాలో ఆమె.. ఏమౌతుందో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో మరో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ అమలా పాల్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో ఆమెను ఈ సినిమాలో నటించేందుకు చిత్ర యూనిట్ అమలా పాల్‌ను సంప్రదించారట.

అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.గతంలో ‘ఆమె’ వంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తమిళంలో పెద్దగా ఆఫర్‌లు లేకపోవడంతో తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరి బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాకు ఆమె ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

#Balakrishna #Boyapati Srinu #Amala Paul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amala Paul Balakrishna Boyapati Srinu Related Telugu News,Photos/Pics,Images..