ఖాళీ చేతులతో ఇండస్ట్రీకి వచ్చా.. కెరీర్ ప్రారంభంలో అలాంటి కష్టాలు పడ్డ: రకుల్

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో తెగ బిజీగా ఉంది.స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ మొత్తానికి స్టార్ హీరోయిన్ క్రేజ్ గా దూసుకుపోతుంది.

 Am Not A Person Who Lives In Fear Says Rakul Preet-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఇంత మంచి గుర్తింపు అందుకున్న రకుల్.బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

అంతే కాకుండా అక్కడ కూడా ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

 Am Not A Person Who Lives In Fear Says Rakul Preet-ఖాళీ చేతులతో ఇండస్ట్రీకి వచ్చా.. కెరీర్ ప్రారంభంలో అలాంటి కష్టాలు పడ్డ: రకుల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ఆ తర్వాత తెలుగులో కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ ను సంపాదించుకుంది.ఇదిలా ఉంటే ఇటీవలే నటించిన చెక్ సినిమాలో అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

తన కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి అభిమానులతో పంచుకుంది.

తను భయంతో బతికే మనిషిని కాదని.చాలా ఫ్రీగా ఉంటానని అని తన వ్యక్తిత్వం గురించి తెలిపింది.

Telugu Bollywood, Carrier, Check Movie, Glamour, Kollywood, Kondapolam, Rakul About Career, Rakul About Tollywood Entry, Rakul Movie Offers, Rakul Preet Singh, Star Heroine, Tollywood-Movie

ఇక తను ఖాళీ చేతులతో ఇండస్ట్రీకి వచ్చానంటూ.ఎంతోమంది అవకాశాల కోసం ఎదురు చూసే చోట తనుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.ఇక తన కెరీర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు బాగా ఎదుర్కుందట‌.కానీ వాటన్నిటినీ అధిగమిస్తేనే గమ్యాన్ని చేరుకోగలం అంటూ ప్రస్తుతం తన కలల్ని సాకారం చేసుకుంటున్నానని తెలిపింది రకుల్.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.టాలీవుడ్ లో ఒక సినిమా కొండపొలం, కోలీవుడ్ లో మరో సినిమా ఐలాండ్ లో నటించగా.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాల్లో బిజీగా ఉంది.

#Glamour #Star Heroine #Carrier #Kollywood #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు