విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈమె పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పూర్తిగా తన జీవితాన్ని సినిమాకి అంకితం చేసింది.
ఈ క్రమంలోనే టాలీవుడ్, కోలీ వుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ఈమె ఒప్పుకోవడమే కాకుండా వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ముందుకు వస్తున్నారు.ఇలా పూర్తిగా ఎన్నో ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులను పలకరిస్తారు.
ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత ప్రతి రోజు ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకోవడం అలవాటుగా మారిపోయింది.
ఈ క్రమంలోనే నిన్న తన స్నేహితులు రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ మీరు లేకుండా నేనేం చేయగలను అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
ఇదిలా ఉండగా తాజాగా సమంత మరొక పోస్ట్ ద్వారా అభిమానులను పలకరించింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈమె చేసిన ఈ పోస్ట్ చూస్తే గత ఏడాది తాను ఎన్నో బాధలు అనుభవించానని అయితే ఈ ఏడాదైనా తనకు సంతోషం అందించాలని ,ఆ సంతోషం తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సమంత షేర్ చేసిన పోస్టులో ఏముంది అనే విషయానికి వస్తే.ఓకే యూనివర్స్.ఒక మంచిని తీసుకోవడం కోసం, ఫీల్ అవడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను….
నేను మంచిగా ఫీలయ్యేలా చెయ్యి అంటూ సమంత పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈమె చేసిన పోస్ట్ చూస్తే నిజంగానే తనకు ఈ ఏడాది మంచి జరగాలని ఆ మంచిని ఆస్వాదించడం కోసం తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది.మరి సమంత ఆశించినట్లు ఈ ఏడాది తనకు మంచి జరగాలని కోరుకుందాం.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె తెలుగులో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం అనే సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.సమంత కూడా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం సమంత యశోద అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఇవే కాకుండా ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాని అదే విధంగా మరొక వెబ్ సిరీస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఇకపోతే సమంత మొట్టమొదటిసారిగా నటించిన ఐటమ్ సాంగ్ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ పాట ద్వారా సమంత మరింత గుర్తింపు సంపాదించుకుందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఎవరి నోటివెంట చూసిన ఉ అంటావా మావా.ఊ ఊ అంటావా మామ అనే పాట వినబడుతోంది.ఈ పాట ద్వారా తనలో ఉన్న మరో కోణాన్ని చూపించింది.