చైనా యాప్స్ నిషేధం.. అన్నింటికి ప్రత్యామ్నయం ఇవే..?

భారత్-చైనా సరిహద్దు లో గాల్వన్ లోయ వద్ద ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులవ్వటంతో బాయ్ కాట్ చైనా అనే నినాదం తెరమీదికి వచ్చింది… ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తోంది.తాజాగా కేంద్రం చైనా కు గట్టి షాక్ ఇచ్చింది.

 Alternative Apps For Banned Chinese Apps,chinese Apps, India China Border, Plays-TeluguStop.com

చైనా కు సంబంధించిన 59 యాప్ ల పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో చైనా యాప్ లకు ప్రత్యామ్నాయం ఏమిటి అని నెటిజన్లు తర్జనభర్జన పడుతున్నారు.

ఫోటోలు వీడియోలు యాప్స్ కనిపించకుండా చేసేందుకు.లాక్ యాప్, స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్ ఫింగర్ప్రింట్, కీప్ సేఫ్, లాక్ మై పిక్స్ లాంటివి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

అదే సమయంలో వార్తలు ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వెతకడానికి… గూగుల్ క్రోమ్ ఓపెరా మొజిల్లా ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌజర్లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

డాక్యుమెంట్ ఫోటోలను సులభంగా మొబైల్ లోనే స్కాన్ చేయాలంటే… మైక్రోసాఫ్ట్ ఫొటోస్, స్కాన్ బై గూగుల్ లాంటి యాప్స్ ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

ఫొటోలను ఎడిట్ చేసేందుకు.పిక్స్ ఆర్ట్, అడోబ్ ఫోటోషాప్, లైట్ రూమ్, గూగుల్ స్నాప్ సీడ్ లాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

వీడియోలను సులభంగా వేగంగా ఎడిట్ చేయడానికి కైన్ మాస్టర్ అడోబ్ ప్రీమియర్, క్లిప్ మ్యాజిక్ యాప్స్ ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ కోసం గూగుల్ మీట్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ గూగుల్ డియో ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

ప్రస్తుతం వీడియోస్ షేరింగ్ యాప్ టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా రోపోసో, డబ్స్మాష్, పెరిస్కోప్ లాంటివి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

ఫోటోలు వీడియోలు యాప్స్ ఫైల్స్ ఇలా వేటినైనా షేరింగ్ చేసుకోవడం కోసం షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్ ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

మొబైల్ లో వైరస్ ప్రవేశించకుండా తొలగించే సెక్యూరిటీ యాప్స్ ఏవిజి, అవాస్త నార్తన్ యాంటీవైరస్ లాంటి యాప్స్ ఉన్నాయి.

ఇక పలు భాషల అర్ధాలు తెలుసుకోవడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యాప్, గూగుల్ ట్రాన్స్లేట్ లాంటి యాప్స్ ఉన్నాయి.

వృత్తిపరంగా లేదా ఇతర పనుల నిమిత్తం ఎక్స్ఎల్ షీట్లో వినియోగించుకోవాల్సిన వస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ లాంటి వాడుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube