టీబీ రోగుల‌ను కూడా పట్టించుకోండి: ఎంపీ

దేశంలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

 Rajyasabha, Mp, Kj Alphonse, Tb Patients-TeluguStop.com

ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.చాల మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ మహమ్మారి వచ్చిన దగ్గరి నుండి దేశంలో ఆసుపత్రిలు, వైద్యులు కరోనా కేసులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారని ఎంపీ కేజే ఆల్ఫోన్స్ అన్నారు.అంతేకాదు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై కూడా కొంచెం శ్రద్ద చూపించాలని అన్నారు.

అయితే దేశవ్యాప్తంగా టీబీ వ్యాధిగ్ర‌స్తులు 24 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నారని తెలియజేశారు.వారికి ఈ మహమ్మారి వచ్చిన దగ్గరి నుండి సరైన చికిత్స అందటం లేదని వాపోయారు.

టీబీ వ్యాధిగ్ర‌స్తులకు సరైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ కేజే ఆల్ఫోన్స్ విజ్ఞ‌ప్తి చేశారు.అంతేకాకుండా రాజ్య‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా ఎంపీ టీబీ రోగుల‌కు వైద్యంపై ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఇక కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టారని తెలిపారు.అందువలన టీబీ రోగులకు వైద్య సదుపాయాలు మందగించిందని పేర్కొన్నారు.దీంతో టీబీ వ్యాధిగ్ర‌స్తులు చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు.ఇక టీబీ వ్యాధిగ్ర‌స్తులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం శ్రద్ద చూపించాలని కోరారు.

ఇక రోగులను గుర్తించే ప్రక్రియను కూడా ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube