సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపు !  

Alok Varma Removal From Cbi Director-

సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన నిన్న (బుధవారం) బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోపే అలోక్‌ను హైపవర్ కమిటీ తొలగించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా అలోక్ ను నియమిస్తున్నట్టు హైపవర్ కమిటీ తెలిపింది..

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపు !-Alok Varma Removal From Cbi Director

అలోక్ వర్మ తొలగింపును లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. అయినప్పటికీ. 2-1 మెజార్టీతో హైపవర్ కమిటీ అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది.

ఇవాళ సాయంత్రం ప్రధాన మంత్రి మోడీ, జస్టిస్ ఏకే సిక్రీ, కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గేతో కూడిన హైపవర్ కమిటీ ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయింది. ఈసందర్భంగా అలోక్ వర్మ అధికారాలు, పదవిపై చర్చించింది. ఆయన్ను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.