జిడ్డు చ‌ర్మంతో బాధ‌ప‌డుతున్నారా.. కలబందతో చెక్ పెట్టేయండిలా!

జిడ్డు చ‌ర్మం. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.

 Aloe Vera Helps To Get Rid Of Oily Skin! Aloe Vera, Oily Skin, Reduce Oily Skin,-TeluguStop.com

ఇలాంటి వారి చ‌ర్మం ఎప్పుడూ జిడ్డుగా క‌నిపిస్తుంటుంది.జిడ్డు చ‌ర్మం చాలా చిన్న స‌మ‌స్య అని కొంద‌రి భావ‌న.

కానీ, జిడ్డు చ‌ర్మం గ‌ల‌వారు చాలా ఇరిటేటింగ్‌ మ‌రియు ఇబ్బందిని ఎదుర్కొంటారు.ముఖం కడుకున్న కొద్ది క్షణాల్లో చ‌ర్మం జిడ్డుగారుతూ కనిపిస్తుంది.

ఇక చ‌ర్మం జిడ్డుగా ఉంటే.మొటిమ‌ల స‌మ‌స్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

అందుకే జిడ్డు చ‌ర్మాన్ని డీల్ చేయ‌డం చాలా క‌ష్టం అని చెప్పాలి.

అయితే జిడ్డు చ‌ర్మాన్ని నివారించ‌డంలో క‌ల‌బంద గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తుంది.

మ‌రి ఇంత‌కీ క‌ల‌బంద‌ను  చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా క‌ల‌బంద గుజ్జు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్‌ వాష్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేస్తూ ఉంటే.కలబందలో అధికంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు.

చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను పీల్చేస్తుంది.ఫ‌లితంగా ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.

Telugu Aloe Vera, Aloe Vera Face, Tips, Latest, Oily Skin, Skin Care-Telugu Heal

ఇక క‌ల‌బంద జెల్‌ను తీసుకుని.ఐస్ ట్రేలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.బాగా గ‌డ్డ క‌ట్టిన త‌ర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌ను ఒక ప‌ల్చ‌టి కాట‌న్ క్లాత్‌లో వేసి.ముఖంపై అద్దుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల జిడ్డును తొల‌గించి.చ‌ర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

అలాగే ఇలా చేయ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.ముఖం కాంతివంతంగా మారుతుంది.

అలాగే జిడ్డు చ‌ర్మాన్ని వ‌దిలించుకోవాల‌ని అని భావించే వారు.ఒక బౌల్‌లో క‌ల‌బంద గుజ్జు, నిమ్మ‌రసం, శెన‌గ‌పిండి వేసి బాగా క‌లిపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

ముఖంలో జిడ్డు త‌గ్గి ఫ్రెష్‌గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube