డస్ట్ అలర్జీ వేధిస్తుందా..? అయితే మీరీ చిట్కాలు ట్రై చేయాల్సిందే!

డస్ట్ అలర్జీఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.

 Aloe Vera Helps To Get Rid Of Dust Allergy! Aloe Vera, Dust Allergy, Latest News-TeluguStop.com

డ‌స్ట్ అల‌ర్జీ ఉన్న వారికి దుమ్ము, ధూళి ఏది తగిలినా.శ్యాస ఆడ‌క‌పోవ‌డం, తుమ్ములు, ముక్కు రంధ్రాల్లో అసౌక‌ర్యంగా అనిపించ‌డం, ముక్కు కారడం, కళ్ల వాపు, దుర‌ద‌, ఛాతిలో బిగుతుగా అనిపించ‌డం, ద‌గ్గు, త‌ల నొప్పి ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు.

ఇలాంటి వారు డ‌స్ట్ అల‌ర్జీని నివారించుకునేందుకు మందులపైనే ఆధారపడుతూ ఉంటారు.కానీ, కొన్ని కొన్ని న్యాచుర‌ల్ చిట్కాల ద్వారా కూడా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.

డ‌స్ట్ అల‌ర్జీని నివారించ‌డంలో క‌ల‌బంద ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

ముందుగా క‌ల‌బంద నుంచి రెండు స్పూన్ల జెల్ తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఇప్పుడు అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటితో క‌ల‌బంద పేస్ట్ క‌లిపి సేవించాలి.

ఇలా చేస్తే డ‌స్ట్ అల‌ర్జీ క్ర‌మంగా దూరం అవుతుంది.

అలాగే లావెండర్ నూనె సైతం డ‌స్ట్ అల‌ర్జీని త‌గ్గించ‌గ‌ల‌దు.

ఒక గిన్నెలో రెండు, మూడు గ్లాసుల వాట‌ర్ పోసి బాగా మ‌రిగించాలి.ఇప్పుడు ఈ నీటిలో నాలుగు లేదా ఐదు చుక్క‌ల లావెండ‌ర్ నూనె వేసి కాసేపు ఆవిరి ప‌ట్టాలి.

రోజుకు ఒక సారి ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Aloe Vera, Dust Allergy, Tips, Latest-Telugu Health - తెలుగు

డ‌స్ట్ అల‌ర్జీని నివారించే శ‌క్తి ఆపిల్ సైడర్ వెనిగర్‌కి కూడా ఉంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి మిక్స్ చేసుకుని సేవించాలి.కావాలీ అనుకుంటే ఒక స్పూన్ లెమెన్ జ్యూన్‌ను కూడా యాడ్ చేసుకోవ‌చ్చు.

త‌ద్వారా డ‌స్ట్ అల‌ర్జీ నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube