స‌మ్మ‌ర్‌లో అలోవెరను వాడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.మండే ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డిపోతున్నారు.

 Aloe Vera Benefits For Face In Summer! Aloe Vera, Benefits Of Aloe Vera, Glowing-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో వేడి వాతావ‌ర‌ణం కార‌ణంగా ఆరోగ్య‌మే కాదు చ‌ర్మం కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే చ‌ర్మం విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

అయితే వేస‌విలో చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో అలోవెర (క‌ల‌బంద‌) అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా నివారిస్తుంది.

ముఖ్యంగా స‌న్ ట్యాన్‌ను దూరం చేయ‌డంలోనూ, చ‌ర్మ కాంతిని పెంచ‌డంలోనూ, ఎండ‌ల వ‌ల్ల క‌మిలిపోయిన చ‌ర్మాన్ని నివారించ‌డంలో ఇలా అనేక విధాలుగా క‌ల‌బంద ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి క‌ల‌బంద‌ను ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

స‌న్ ట్యాన్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు క‌ల‌బంద గుజ్జు తీసుకుని అందులో పాల మీగ‌డ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్‌కు గురైన ప్రాంతంలో అప్లై చేసిఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే స‌న్ ట్యాన్ స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు ఎండ వ‌ల్ల క‌మిలిన చ‌ర్మం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొందుతారు.

Telugu Aloe Vera, Tips, Face, Latest, Skin Care-Telugu Health - తెలుగ�

అలాగే క‌ల‌బందం నుంచి గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా అరటి పండు పేస్ట్ మ‌రియు బాదం ఆయిల్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ముఖానికి, మెడ‌కు అప్లై చేసి బాగా డ్రై అవ్వ‌నివ్వాలి.అనంతరం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.

ఇక వేస‌విలో ముఖం త‌ర‌చూ డ్రై అయిపోతూ ఉంటుంది.అయితే క‌ల‌బంద గుజ్జును డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేసి.వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల ముఖం హైడ్రేటెడ్‌గా మ‌రియు తాజాగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube