అల్లుడితో ఇస్మార్ట్‌ అందాలు అదుర్స్‌

నాగచైతన్యతో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్‌ మజ్ను సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్ కు పెద్దగా గుర్తింపు రాలేదు.కాని రామ్‌ తో నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ఈ అమ్మడికి స్టార్‌ ఇమేజ్ సొంతం అయ్యింది.

 Alludu Adurs Movie Heroine Nidhi Agarwal Glamour Treat , Alludu Adhurs Movie, Be-TeluguStop.com

ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్దం అవుతున్నాయి.తెలుగు మరియు తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది.

ఈమె నటించిన తెలుగు సినిమా అల్లుడు అదుర్స్‌ విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ లోని ఈ అమె అందాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో కాస్త పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు అల్లుడు అదుర్స్ లో అదిరిపోయే కాస్ట్యూమ్స్ లో కనిపించినట్లుగా పోస్టర్లను చూస్తుంటే అనిపిస్తుంది.

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్‌ సినిమాకు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా అను ఎమాన్యూల్‌ నటించిన విషయం తెల్సిందే.ఆమె కంటే ఎక్కువగా నిధి అగర్వాల్‌ కే ఎక్కుగా పబ్లిసిటీలో ఫోకస్‌ లభించింది.

తప్పకుండా ఈ సినిమా మరో సారి అమ్మడికి మంచి పేరు తీసుకు వచ్చి ఈసారి పెద్ద హీరోలతో నటించే అవకాశంను తెచ్చి పెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అందం నిధి అగర్వాల్ ది అంటూ నెటిజన్స్‌ పోస్టర్స్ కు కామెంట్స్‌ చేస్తున్నారు.

అల్లుడితో కలిసి రాబోతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ ఈసారి రచ్చ రచ్చ గా అందాల ప్రదర్శణ చేయడంతో పాటు సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించబోతున్నట్లుగా అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube