దసరాకే వస్తానంటోన్న అల్లుడు.. అదరగొడతాడా?  

Alludu Adhurs To Release During Dussehra - Telugu Alludu Adhura, Anu Emmanuelle, Bellamkonda Sreenivas, Nabha Natesh, Santhosh Srinivas

టాలీవుడ్‌లో అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.తొలి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్న ఈ హీరో, ఆ తరువాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు.

 Alludu Adhurs To Release During Dussehra

అయితే అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయాడు.కాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది.కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొదలుపెట్టి దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.జూలైలో ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా అన్ని పనులు ముగించాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

దసరాకే వస్తానంటోన్న అల్లుడు.. అదరగొడతాడా-Gossips-Telugu Tollywood Photo Image

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో మరో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను జి.సుబ్రహ్మణ్యం ప్రొడ్యూస్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మరి ‘అల్లుడు అదుర్స్’ చిత్రం బెల్లంకొండ బాబుకు ఎలాంటి హిట్ అందిస్తుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా, దానికి మంచి రెస్పాన్స్ లభించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Alludu Adhurs To Release During Dussehra Related Telugu News,Photos/Pics,Images..

footer-test