అల్లుడు అలాంటి కథతో అదుర్స్ అనిపిస్తాడట!

టాలీవుడ్‌లో అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు.

 Alludu Adhurs To Be Action Entertainer,alludu Adhurs, Bellamkonda Sreenivas, Nid-TeluguStop.com

రీసెంట్‌గా రాక్షసుడు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.

అయితే తాజాగా అల్లుడు అదుర్స్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ బాబు సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు.ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హాట్ ఐటెం సాంగ్‌లో నటించనుంది.

ఇక ఈ సినిమా కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ కథను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్.

మొత్తానికి ఈసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో అల్లుడు అదుర్స్ అనిపించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube