ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో ఢీలా పడ్డ అల్లుడు

టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అయితే కరోనా కారణంగా ఈ సంక్రాంతికి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయా అనే సందేహం అందరిలోనూ నెలకొని ఉంది.

 Alludu Adhurs First Weekend Collections, Alludu Adhurs, Bellamkonda Sai Sreeniva-TeluguStop.com

దీంతో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిగా చూపలేదనే విషయం వాస్తవం.కరోనా నేపథ్యంలో థియేటర్లకు ఎక్కువ జనం రావడానికి భయపడ్డారు.

ఇక సగం అక్యుపెన్సీతో థియేటర్లు నడవడం కూడా ఈ సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్ చూపెట్టింది.

దీంతో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రం బాగా దెబ్బతిందని చెప్పాలి.

కందిరీగ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లతో ఆకట్టుకున్నా, సినిమా థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో మరో యావరేజ్ మూవీగా ఈ అల్లుడు అదుర్స్ నిలవబోతుందని ఈ చిత్ర కలెక్షన్లు చెబుతున్నాయి.

నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ వంటి హేమాహేమీలు ఉన్నా సినిమా కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.09 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది.ఫ్లాప్ దిశగా ఈ సినిమా వెళ్తుండటంతో టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు సాధిస్తుందా అని సినీ ఎక్స్‌పర్ట్స్ లెక్కలు వేస్తున్నారు.కాగా ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.38 కోట్లు

సీడెడ్ – 0.95 కోట్లు

గుంటూరు – 0.39 కోట్లు

వైజాగ్ – 1.16 కోట్లు

ఈస్ట్ – 0.32 కోట్లు

వెస్ట్ – 0.40 కోట్లు

కృష్ణా – 0.21 కోట్లు

నెల్లూరు – 0.19 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 5.0 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ – 0.09 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.5.09 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube