బెల్లంకొండ రెడీ అయ్యాడు

మూడు నెలల బ్రేక్‌ తర్వాత షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతించిన వెంటనే సీరియల్స్‌ షూటింగ్స్‌ చాలా స్పీడ్‌గా ప్రారంభం అయ్యాయి.కొన్ని సినిమాల షూటింగ్స్‌ మొదలు అయ్యాయి.

 Bellam Konda Sai Srinivas Ready To Complete His Movie Alludu Adhurs, Bellam Kond-TeluguStop.com

కాని మెజార్టీ సినిమాల షూటింగ్స్‌ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.వచ్చే నెల నుండి సినిమాల షూటింగ్‌ మరింత ఎక్కువగా జరిగే అవకావం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రముఖ హీరోలు కాస్త సమయం తీసుకున్నా చిన్న హీరోలు జులై నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు సిద్దం అవుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన అల్లుడు అదుర్స్‌ చిత్రాన్ని మద్యలో వదిలేశాడు.

సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్‌ 70 శాతంకు పైగా పూర్తి అయ్యింది.సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో సినిమాను నిలిపేసిన విషయం తెల్సిందే.మళ్లీ ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన వచ్చిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుండి షూటింగ్‌కు వెళ్లబోతున్నారు.

Telugu Alludu Adhurs, Bellamkonda, Nabha Natesh, Santhoshsai, Tollywood-Movie

ఆగస్టులో షూటింగ్‌ను పూర్తి చేసి పరిస్థితులు కుదుట పడితే ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.నభా నటేష్‌ ఈ చిత్రంలో బెల్లంకొండకు జోడీగా నటిస్తోంది.ఈమద్య కాలంలో బెల్లంకొండ చాలా స్లిమ్‌ అవ్వడంతో పాటు సిక్స్‌ ప్యాక్‌ను కూడా ట్రై చేసినట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా వ్యక్తం అవుతున్నాయి.

కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు పెట్టింది పేరు అయిన సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాను ఖచ్చితంగా సక్సెస్‌ చేస్తాడని భావిస్తున్నారు.మొత్తానికి వచ్చే నెల నుండి బెల్లంకొండ రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube