పుష్ప కథ ఇదేనట.. సోషల్ మీడియాలో వైరల్!  

Alluarjun Pushpa Story Leaked Sukumar - Telugu Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Story Leaked, Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Alluarjun Pushpa Story Leaked Sukumar

అయినా లాక్‌డౌన్‌ను పూర్తిగా వినియోగించుకుంది ఈ చిత్ర యూనిట్.బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్‌ను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.మాస్ లుక్‌లో బన్నీ అదరగొట్టడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

పుష్ప కథ ఇదేనట.. సోషల్ మీడియాలో వైరల్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో బన్నీ భార్యగా నటిస్తున్న రష్మిక మందన్న ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుందట.

అయితే ఆమెను కొందరు దుండగులు చంపేస్తారు.దీంతో వారిపై పగ తీర్చుకునేందుకు బన్నీ లారీ డ్రైవర్ అవతారమెత్తుతాడని, ఇందులో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడతాడని తెలుస్తోంది.

పూర్తి మాస్ యాక్షన్‌తో కూడుకున్న సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.బన్నీ మాస్ లుక్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే మేజర్ అసెట్ కానున్నట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు