ఆ పిల్లాడి కోరిక తీర్చిన అల్లు అర్జున్..!

అల్లు అర్జున్.ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Alluarjun Given Gift To Orphons Allu Arjun,allu Ayan,christmas,allualluarjun,ay-TeluguStop.com

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు కేరళలోను ఊహించని రేంజ్ లో అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు.అందుకే ఏదైనా ఫండ్స్ ఇచ్చే సమయంలో అయినా.

మరే సమయంలో అయినా కూడా అల్లు అర్జున్ కేరళపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు.దాదాపు కొన్నేళ్ల నుంచి హిట్ లు లేకపోయినా ఈ సంవత్సరసం అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమాతో అభిమానులు కాని వారు కూడా అభిమానులు అయ్యారు.ఇంకా ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి పిల్లలు కూడా అభిమానులు ఉన్నారు.ఇక అలానే ఓ చిన్నారి కూడా అల్లు అర్జున్ అభిమానినే.ఎప్పిటికైనా బన్నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నది ఆ బాలుడి కోరిక.

ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తాను సంతకం చేసిన ఓ పేపర్ ని తన కుమారుడు అయాన్ కు ఇచ్చి అనాథాశ్రమానికి పంపారు.

క్రిస్మస్ సందర్భంగా ఆ ఆటోగ్రాఫ్ ను అల్లు అయాన్ ఆ బాలుడికి ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.

అది మాత్రమే కాదు. అనాథాశ్రమంలో ఉన్న మిగిలిన చిన్నారులకు కూడా పలు గిఫ్ట్ లు ఇచ్చి ఆనందపరిచాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బన్నీ సైన్ చేసిన ఆ పేపర్ చూసి ఆ బాలుడు ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏది ఏమైనా అల్లు అర్జున్ తన అభిమానుల ఆనందం కోసం ఏమైనా చేస్తాడు అని అనడానికి ఇదొక నిదర్శనం.మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube