'ఆహా' అల్లు వారు తలుచుకుంటే ఏడాదిలోనే ఈ రేంజ్‌కు తీసుకు వెళ్లగలరు

ప్రపంచం మొత్తం భవిష్యత్తులో ఓటీటీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో మునిగి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కరోనా కారణంగా థియేటర్లు మూత పడ్డ సమయంలో చాలా మంది కూడా ఓటీటీ లో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఎంజాయ్‌ చేశారు.

 Allu Vaari Aha Ott Completed One Year Successfully, Aha, Ott, Allu Aravind, Allu-TeluguStop.com

ఇప్పుడు మరింతగా ఓటీటీ పరిధి పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకే ఆహా ను అల్లు అరవింద్‌ ప్రారంభించాడు.

తెలుగు కు ప్రత్యేకంగా ఓటీటీ ఏంటో, అమెజాన్‌ తో పాటు ఇంకా చాలా ఓటీటీలు ఉండగా ఇలా తెలుగు కు ప్రత్యేకంగా అంత డబ్బు పెట్టి ఎవరు తీసుకుంటారండి అంటూ కొందరు పెదవి విరిచారు.కాని అనూహ్యంగా అల్లు వారి ఆహాకు మంచి ఆధరణ దక్కింది.

నేటికి సరిగ్గా ఏడాది పూర్తి అవ్వడంతో ఆహా గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పలు విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

ఆహా మొదట స్ట్రీమింగ్‌ అయిన సమయంలో చాలా మంది బూతు కంటెంట్ అంటూ విమర్శలు చేశారు.

ముందే బూతు కంటెంట్‌ కూడా ఉంటుందని చెప్పిన అల్లు అరవింద్‌ మొత్తం బూతు కంటెంట్ తో నింపేశాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఆ సమయంలోనే కరోనా కారణంగా ఆహాలో పెద్దగా స్ట్రీమింగ్‌ కు ఏమీ లేవు.

ఎప్పుడైతే షూటింగ్ లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారో అప్పటి నుండి ఆహాలో కంటెంట్‌ నింపడం మొదలు పెట్టారు.వరుసగా చిన్న సినిమాలు వెబ్‌ సిరీస్ లు మలయాళం మరియు తమిళ డబ్బింగ్‌ సినిమాలను స్ట్రీమింగ్‌ చేయడం మొదలు పెట్టారు.

దాంతో ఆహా ను ఓ రేంజ్ లో ప్రేక్షకులు ఆధరించడం మొదలు పెట్టారు.భారీ ఎత్తున స్ట్రీమింగ్ కు ఖాతాదారులు చేరారు.ఇప్పటికే సినిమాలు అంటే ఆహా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఆహాను మంచి కంటెంట్‌ తో టాప్ కు తీసుకు వెళ్లేందుకు అల్లు అరవింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఏడాది కాలంలోనే ఆహాను ప్రతి ఒక్కరి చెంతకు తీసుకు వెళ్లడంలో ఎంతో కీలకంగా అల్లు అరవింద్‌ వ్యవహరించాడు.ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఆహాకు బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

Telugu Aha Ott, Allu Aravind, Allu Arjun, Ambassador, Successfully, Telugu, Telu.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube