హాలీవుడ్‌ స్టూడియో రేంజ్‌లో అల్లు స్టూడియోస్‌

అల్లు రామలింగయ్య 99 వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ సినిమా స్టూడియో నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా స్టూడియో గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 Allu Studio Is Going To Like Hollywood Studio, Allu Family, Allu Film Studio, Al-TeluguStop.com

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 10 ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరగబోతున్నట్లుగా అల్లు వారి ఫ్యామిలీ సన్నిహితులు ఇప్పటికీ మీడియా వర్గాలకు లీక్‌ ఇచ్చారు అల్లు స్టూడియోస్ అనే పేరుతో నిర్మాణం జరుగబోతున్న ఈ స్టూడియోలో భారీ టెక్నికల్ వ్యాల్యూస్ ఉండడంతో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని కూడా వినియోగించబోతున్నారు.
ఒకే సమయంలో పది సినిమాల షూటింగ్ చేసుకోవడంతో పాటు ఎంత మంది ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఈ స్టూడియో నిర్మాణం జరుగబోతుందట.

అనేక సెట్టింగులు కూడా ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు.ఇందులో భారీ ఫ్లోర్‌ లో ఇండోర్ అవుట్ డోర్ షూటింగ్ లు చేసుకోవడంతో పాటు అనేక వసతులు కూడా ఉంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న స్టూడియోలను మించి ఈ స్టూడియో ఉండేలా అల్లు వారి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తుంది.ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మరియు స్టూడియో తో కలిసి అల్లు వారు ఈ స్టూడియోను ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.

అతి త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం ను షురూ చేసి వచ్చే ఏడాది అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ప్రారంభించాలని అల్లు వారి ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.

ఈ స్టూడియోలో సినిమాలు, సీరియల్స్‌, షోలు, వెబ్ సిరీస్ ను ఇలా అన్ని రకాల షూటింగ్స్‌ చేసుకునేందుకు గాను వీలు కల్పిస్తున్నారు.

చిన్న సినిమాల నుండి భారీ సినిమాల వరకు అన్ని సినిమాలకు ఇది ఉపయోగకరంగా ఉండేలా చూస్తున్నారు.కథతో ఈ సినిమా స్టూడియోలో అడుగు పెడితే సినిమా అవుట్ పుట్ తో బయటికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు అల్లు ఫ్యామిలీ వారు చెబుతున్నారు.

అతి త్వరలోనే ఈ స్టూడియో సంబంధించి మరిన్ని విషయాలను అల్లు వారు అధికారికంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.ఈ స్టూడియో తెలుగు వారు గర్వించేలా ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube