Allu Sneha Reddy Janhvi Kapoor: సూపర్ మోడల్ లుక్ లో జాన్వీ కపూర్-స్నేహ రెడ్డి.. పిక్స్ వైరల్!

ఇది వరకుతో పోల్చితే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు కాస్త లైమ్ లైట్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు.

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వారు ప్రతి నిత్యం ఫాలోవర్స్ కు చేరువలో ఉంటున్నారు.

మరి అందులో అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువుగానే ఉంటారు.

తమ లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ను స్నేహ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.టాలీవుడ్ లో కొత్త స్టైల్ తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.

ఈయన ప్రేక్షకుల చేత స్టైలిష్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.ఇక ఈ స్టైలిష్ స్టార్ భార్య కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాషన్ ఫాలో అవుతుంది.

Advertisement

ఇక తాజాగా స్నేహ రెడ్డి కొన్ని రోజుల క్రితం ది ట్రీ ఆఫ్ లైఫ్ కలెక్షన్ లో భాగంగా డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన స్టైలిష్ గౌన్ వేసుకున్న విషయం విదితమే.అప్పుడు ఆ గౌన్ లో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అందుకు కారణం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అనే చెప్పాలి.ఈమె సేమ్ అల్లు స్నేహ రెడ్డి వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ నే వేసుకుని ఫోటో షూట్ చేయడంతో వీరిద్దరి పిక్స్ పక్కపక్కన పెట్టి నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు.ఈ డ్రెస్ లో ఇద్దరు చాలా స్టైలిష్ గా హాట్ గా కనిపిస్తున్నారు.

ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇలా అల్లు స్నేహ ఎప్పుడో వేసుకున్న గౌన్ లాంటిది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇప్పుడు వేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.ఈ డ్రెస్ లో ఇద్దరు కూడా సూపర్ మోడల్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తున్నారు.దీంతో అల్లు ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోను వైరల్ చేసేస్తున్నారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఇక అల్లు అర్జున్, స్నేహ పెళ్లి చేసుకుని 11 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు.ఇక వీరికి అయాన్, అర్హ ఇద్దరు క్యూట్ బేబీస్ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు