''ప్రేమకాదంట'' సినిమా డబ్బింగ్ స్టార్ చేసేసిన శిరీష్ !

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు.అల్లు అర్జున్ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా తన అన్న పేరును ఉపయోగించుకుని పైకి రావాలి అనుకోవడం లేదు.

 Allu Sirish Starts Dubbing For Prema Kadanta Movie-TeluguStop.com

తన నటనతో ప్రేక్షకులను మెప్పించి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.అల్లు శిరీష్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు సూపర్ హిట్ అవ్వక పోయిన సినిమా సినిమాకు నటన పరంగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు.

అల్లు శిరీష్ చాలా రోజులుగా కొత్త సినిమాలు ఏమి ప్రకటించలేదు. ఎబిసిడి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ”ప్రేమకాదంట” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Allu Sirish Starts Dubbing For Prema Kadanta Movie-ప్రేమకాదంట సినిమా డబ్బింగ్ స్టార్ చేసేసిన శిరీష్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లు శిరీష్ ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యాడు.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మంచి స్పందన అందుకున్నాయి.ఈ సినిమా అధికారికంగా ప్రకటించక ముందే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.

ప్రస్తుతం అల్లు శిరీష్ ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది.

Telugu Allu Sirish, Allu Sirish Starts Dubbing For Prema Kadanta Movie, Anu Emmanuel, Dubbing, Prema Kadanta Movie, Social Media-Movie

ఈ విషయం స్వరంగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.డబ్బింగ్ చెబుతుండగా అందుకు సంబంధించిన ఫోటో ఒక తన ఖాతాలో షేర్ చేసాడు.ఈ సినిమాను జిఎ2 పిక్చర్స్ మరియు తిరుమల ప్రొడక్షన్ లిమిటెడ్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎప్పటి నుండో విజయం కోసం తపిస్తున్న అల్లు శిరీష్ కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

#Allu Sirish #Anu Emmanuel #AlluSirish #PremaKadanta #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు