అనూకి అల్లు శిరీష్ స్పెషల్ విషెష్.. "హ్యాపీ బర్త్ డే సైకో" అంటూ..

ఒక్కసారి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాక వాళ్ళ మీద ఏదొక విషయంలో పుకార్లు వస్తూనే ఉంటాయి.హీరో హీరోయిన్స్ మీద అయితే మరిన్ని పుకార్లు వస్తుంటాయి.

 Allu Sirish Special Wishes To Anu Emmanuel On Her Birthday, Allu Sirish, Special-TeluguStop.com

వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది.అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

తాజాగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి.వీళ్లిద్దరు మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.

ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అవి చూసిన చాలా మందికి ఆ అనుమానం వచ్చింది.అను ఇమ్మాన్యూల్ తో కాఫీ తాగుతూ, దోస తింటూ ఇలా రకరకాల ఫోటోలను శిరీష్ పోస్ట్ చేస్తున్నాడు.

తాజాగా నిన్న పుట్టిన రోజు జరుపుకున్న అను కి శిరీష్ స్పెషల్ విషెష్ తెలిపాడు.హ్యాపీ బర్త్ డే సైకో.అంటూ పోస్ట్ చేసాడు.

ఇప్పుడు ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

శిరీష్ పోస్ట్ పెట్టి సర్ప్రైజ్ చేయడంతో అను ఓ మై గాడ్ అంటూ హార్ట్ సింబల్ పెట్టడంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అనే అనుమానం చాలా మందికి వస్తుంది.అయితే మరికొంతమంది మాత్రం అల్లు శిరీష్ తో ఒక సినిమా చేస్తున్న కారణంగానే వీళ్లిద్దరు అంత క్లోజ్ గా ఉంటున్నారని అంటున్నారు.

అల్లు శిరీష్ ‘ఎబిసిడి‘ సినిమా తర్వాత ఎలాంటి సినిమా ప్రకటించలేదు.కానీ ఇతడు సీక్రెట్ గా ఒక సినిమా చేస్తున్నాడని అందులో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాకపోయినా షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతుందని సమాచారం.ఇది ఇలా ఉండగా అను ఇమ్మాన్యూల్ ప్రస్తుతం మహాసముద్రం సినిమా చేస్తుంది.

ఈ సినిమాను ఆగస్టు 19 న విడుదల చేయబోతున్నారు.వరస ప్లాపులతో కెరీర్ పరంగా వెనుకబడిన అను ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలని చూస్తుంది.

https://www.instagram.com/p/CM-JJdnl8E7/

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube