స్పోర్ట్స్ కార్ అడిగితే నాన్న చెప్పుతో కొడతా అన్నారు...ఆ రోజు ఆలా అని ఉండకపోతే!  

Allu Sirish Speach About His Father-bike,bus,general Telugu Updates,malayalam,sports Car,నాన్న

గౌరవం చిత్రంతో వెండి తెరకు పరిచయం అయినా మెగా హీరో అల్లు శిరీష్. చాలా నిదానముగా సైలంట్ గా సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అని అనిపించుకుంటున్నాడు. అయితే చాలా రోజుల గ్యాప్ తో ఒక రీమేక్ చిత్రం తో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

స్పోర్ట్స్ కార్ అడిగితే నాన్న చెప్పుతో కొడతా అన్నారు...ఆ రోజు ఆలా అని ఉండకపోతే!-Allu Sirish Speach About His Father

మలయాళీ సూపర్ హిట్ చిత్రం అయిన ఎబిసిడి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీ లో అల్లు శిరీష్ నటించాడు. అయితే సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విశేషాలు తెలిపాడు. ఈ చిత్రంలో జరిగిన సంఘటన సరిగ్గా నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను.

21 ఏళ్ల వయసులో నాన్న బన్నీ కి కొత్త కారు కొనిచ్చారు. చెర్రీ కి కూడా అదే వయసులో కొత్త కారు వచ్చింది.

అందుకే నేను కూడా నా 21 ఏళ్ల వయసులో కొత్త స్పోర్ట్స్ కారు కావాలని నాన్నని అడిగితే దానికి నాన్న చెప్పుతో కొడతా అని అన్నారు. నీ వయసు కుర్రాళ్లంతా బస్సుల్లో, బైకులపై తిరుగుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం డబ్బు విలువ తెలియకుండా స్పోర్ట్స్ కారు అడుగుతున్నావు అని తిట్టినట్లు శిరీష్ తెలిపారు.

ఆ రోజు నాన్న నన్ను ఆలా అని ఉండక పొతే నటుడు అవ్వాలన్న కోరిక నాకు వచ్చేది కాదు అని అల్లు శిరీష్ తెలిపాడు. అలానే ఈ చిత్రం లో నటించడానికి ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రాం చరణ్ అని తెలిపాడు. ఒక్క క్షణం మూవీ తరువాత తదుపరి చిత్రం ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్న సమయంలో చెర్రీ నాకు మలయాళం లో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ గురించి చెప్పాడు.

ఒక్కసారి ఆ చిత్రం చూడు నీకు ఆ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది అని సజెస్ట్ చేయడం తో ఆ చిత్రాన్ని చూసాను. అయితే ఆ సినిమా నాకు కూడా చాలా బాగా నచ్చడం తో దానిని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మే 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.