ఆహాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. అల్లు శిరీష్ షాకింగ్ ట్వీట్?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

 Allu Sirish Shocking Tweet About Aha App Goes Viral Allu Sirish, Aha App, Viral Tweet, Tollywood, Allu Aravind, Allu Arjun-TeluguStop.com

అల్లు అరవింద్ తెలుగులో స్థాపించిన ఏకైక ఓటీటీ యాప్ ఆహా.ఈ ఓటిటి యాప్ పలు వెబ్ సిరీస్ లతో అలాగే సరికొత్త రియాలిటీ షోలతో డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే ఆహా అగ్ర ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ఆహా సబ్ స్క్రైబర్ ల సంఖ్య కూడా రోజురోజుకీ గణనీయంగా పెరుగుతూనే ఉంది.

 Allu Sirish Shocking Tweet About Aha App Goes Viral Allu Sirish, Aha App, Viral Tweet, Tollywood, Allu Aravind, Allu Arjun-ఆహాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. అల్లు శిరీష్ షాకింగ్ ట్వీట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఆహా విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ అల్లు వారసుడు అయినా హీరో అల్లు శిరీష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆహా సబ్స్క్రైబర్లు యాప్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని ట్విట్టర్ వేదికగా లేవనెత్తుతూ, యాప్ కు సంబంధించిన సాంకేతిక సమస్యల గురించి పరిష్కరించాల్సి ఉంది గా ఆహా వీడియోస్ దీంతో పాటుగా అల్లు అరవింద్,అల్లు అర్జున్, అల్లు శిరీష్ లను ట్యాగ్ చేస్తున్నారు.ఆహా లో ఎటువంటి సాంకేతిక ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో వారిని టార్గెట్ చేస్తూ ట్యాగ్ చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై స్పందించిన అల్లు శిరీష్.వీటిని షేర్ చేసి.ఆహా ని ట్యాగ్ చేస్తూ చాలా మంది నేను ఆహా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు.దయచేసి ఆహా టీం కంప్లైంట్స్ ని చూడండి అంటూ పోస్ట్ చేశాడు.

అల్లు శిరీష్ ఈ విధంగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఏంటి? అల్లు శిరీష్ కు ఆహా కు సంబంధం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.అంతే కాకుండా ఆహా అల్లు ఫ్యామిలీదే కదా.మరి అలాంటప్పుడు ఆహా తో తనకు సంబంధం లేకపోవడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ అల్లు శిరీష్ ఇంకా ఆహా బాధ్యతలు స్వీకరించలేదేమో అందుకే ఇలా స్పందించాడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube